సినిమాలో నటించే హీరోయిన్స్( Heroines ) అంటే గ్లామర్ వలకబోయాలి.అందాలు చూపించాలి … అవసరం ఉన్న లేకున్నా పొట్టి బట్టలు వేసుకొని స్క్రీన్ పై తల తలా మెరిసిపోవాలి.
వేసుకున్న బట్టల్లో కూడా పూర్తిస్థాయి నిండుతనం కనిపించకూడదు.అరకొర బట్టలు వేసుకొని అందాల ప్రదర్శనే మెండుగా పెట్టుకొని పని చేయాల్సి ఉంటుంది.
ఇలా ఉంటేనే సినిమా ఇండస్ట్రీలో నెగ్గుకొస్తారు అనేది చాలా ఏళ్లుగా అందరు చెప్పే మాట.దాచుకుంటే కుదరదు.చూపిస్తేనే కుదురుతుంది అంటూ ఉంటారు.సరే వారి మాటల్లో అర్థం ఏదైనా సినిమా ఇండస్ట్రీ( Cinema Industry ) అంటే నేను గ్లామర్ ప్రపంచం.ఈ ప్రపంచంలో నిండుగా బట్టలు కట్టుకొని సినిమాలు తీసేవారు చాలా తక్కువ.
హీరోయిన్ అనగానే అందాల ప్రదర్శనకు మాత్రమే అన్నట్టుగా వారి పాత్రల డిజైనింగ్ కూడా ఉంటుంది.కేవలం నాలుగు పాటల్లో హీరో పక్కన గంతులు వేయడానికి మాత్రమే వారికి అవకాశం దొరుకుతుంది.లేదంటే హీరో రొమాన్స్ చేయడానికి, ముద్దు పెట్టుకోవడానికి మాత్రమే హీరోయిన్స్ పాత్రలు ఉంటాయి.
కానీ వీటన్నింటికీ విరుద్ధంగా గతంలో కొంతమంది హీరోయిన్స్ తమను తాము కాపాడుకుంటూ తమ పాత్రను కూడా సినిమాలలో చాలా పద్ధతిగా చూపించారు.సెక్సీ అప్పీల్ కనిపించాలంటే బొడ్డు, తొడలు, అందాల ప్రదర్శన చేయడం కాదు.
మునిపంటితో పెదవిని కొరికినా చాలు ఎంతో హాట్ ప్రదర్శన కుదురుతుంది అని నిరూపించిన నటిమని స్నేహ.( Sneha )
ఆమె ఏ సినిమాలో కూడా తన అందాన్ని ప్రదర్శించడానికి పెద్దగా ఒప్పుకోలేదు.కేవలం చిన్నచిన్న ఎక్స్ప్రెషన్స్ తోనే సెక్సీ గా కనిపించేలా ప్రయత్నించేది.అందుకు ఉదాహరణ శ్రీరామదాసు సినిమాలో( Sri Ramadasu Movie ) నాగార్జునకు స్నేహకు తొలిరాత్రి సన్నివేశం.
ఇది మీరు ఒక్కసారి చూస్తే ఆమె ఎలా తన కళ్ళతో నోటితో అభినయం చూపించిందో మనం అర్థం చేసుకోవచ్చు.గతంలో సౌందర్య, సావిత్రి వంటి వారు కూడా నిండైన వస్త్రధారులతోనే సినిమాల్లో నటించారు.
ఇప్పుడు సాయి పల్లవి మాత్రమే అలా కనిపిస్తుంది.ఇక భవిష్యత్తులో అయినా హీరోయిన్స్ విషయంలో వారి పాత్రల డిజైన్ విషయంలో మేకర్స్ కాస్త జాగ్రత్తలు తీసుకుంటే మంచిది
.