ఈ స్టార్స్‌ మదర్‌ ఎప్పటికి పెళ్లి చేసుకోదట

ఈమద్య కాలంలో స్టార్‌ హీరోల సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా సితార ఎక్కువగా కనిపిస్తోంది.

హీరోయిన్‌గా ఒక మోస్తరుగా గుర్తింపు దక్కించుకున్నా ప్రస్తుతం ఈమె మాత్రం చాలా ఫేమస్‌ అయ్యింది.

చాలా మంది స్టార్‌ హీరోల సినిమాల్లో ఈమె తల్లి పాత్రలో అత్త పాత్రలో కనిపించింది.అయితే ఈమె నాలుగు పదుల వయసు దాటినా కూడా ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు.

పెళ్లి ఎందుకు చేసుకోలేదు అంటూ ఎవరైనా ప్రశ్నిస్తే ఆ అవసరం రాలేదు అంటోంది.తన తండ్రి ఉన్న సమయంలో ఎక్కువగా నా పెళ్లి గురించి ప్రయత్నాలు చేసేవారు.

కాని ఆయన చనిపోయిన తర్వాత నన్ను పెళ్లి చేసుకోమని అనే వారు ఎవరు లేరు.అందుకే నేను పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదు.

Advertisement

ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా నేను పెళ్లి చేసుకోను.నేను ఉన్నంత కాలం సింగిల్‌గానే ఉంటానంటూ చెప్పుకొచ్చింది.

ఎంతో మంది సింగిల్‌గా జీవితాన్ని గడుపుతున్నారు.ప్రస్తుత కాలంలో సింగిల్‌గా ఉన్నా తోడుగా ఉన్నా కూడా పెద్దగా తేడా లేదు అనేది నా అభిప్రాయం.

అందుకే పెళ్లి చేసుకోవాలనే ఆలోచన నాకు ఎప్పుడు కలగలేదని చెప్పుకొచ్చింది.మొత్తానికి సితార పెళ్లి విషయంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చర్చనీయాంశం అవుతున్నాయి.

జూనియర్ ఎన్టీఆర్ పేరు బాలయ్యకు నచ్చదా.. తన తండ్రి పేరు దక్కడం బాలయ్యకు ఇష్టం లేదా?
Advertisement

తాజా వార్తలు