చిరంజీవి ఇష్టమని చెబితే మోహన్ బాబు నేలకేసి కొట్టాడు.. నటి షాకింగ్ కామెంట్స్!

చైల్డ్ ఆర్టిస్ట్ గా పదుల సంఖ్యలో సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించుకున్న శ్రేష్ట ( shreshta )ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను చెప్పుకొచ్చారు మంచి రోల్ వస్తే సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమని ఆమె అన్నారు.తాను చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా ముఖ్యమైన పాత్రల్లో నటించానని ప్రాధాన్యత ఉన్న పాత్రలు వస్తే మళ్లీ నటించాలని భావిస్తున్నానని ఆమె తెలిపారు.

 Actress Shreshta Shcoking Comments About Mohan Babu And Chiranjeevi Details He-TeluguStop.com

నేను మంచి హ్యూమన్ బీయింగ్ అనుకుంటే చాలని శ్రేష్ట పేర్కొన్నారు.బయోటెక్ ఫర్మ్ పెట్టాలని నా ఆశయమని అలా చేయడం సులువు కాదని అయినప్పటికీ అదే నా గోల్ అని ఆమె కామెంట్లు చేశారు.

నేను ఇంజనీరింగ్, మాస్టర్స్ బయో టెక్నాలజీలో చేశానని శ్రేష్ట తెలిపారు.నాకు ఇన్స్పిరేషన్ ఎవరనే ప్రశ్న ఎదురైతే ఎప్పటికీ చిరంజీవి ( Chiranjeevi )అనే చెబుతానని ఆ సమాధానం మారదని ఆమె కామెంట్లు చేశారు.

చిరంజీవి గారు ఛారిటీ చాలా చేస్తారని ఆమె వెల్లడించారు.గర్ల్ గా నేను ఛాలెంజెస్ ఫేస్ చేశానని శ్రేష్ట పేర్కొన్నారు.రియల్ లైఫ్ లో చీటింగ్ అంటే ఏంటో తెలుసుకున్నానని అమ్మాయే కదా అనుకుని కొన్ని పనులు చేస్తారని ఆమె వెల్లడించారు.మేజర్ చంద్రకాంత్ ( Major Chandrakant )షూట్ సమయంలో జర్నలిస్ట్ ప్రభు నా ఇంటర్వ్యూ తీసుకుని చిరంజీవే నా ఫేవరెట్ హీరో అని హెడ్డింగ్ పెట్టారని శ్రేష్ట తెలిపారు.

మేజర్ చంద్రకాంత్ షూట్ జరుగుతుండగా ఆ హెడ్డింగ్ చూసిన మోహన్ బాబు ( Mohan Babu )గారు సెట్ కు వచ్చి పేపర్ తీసుకుని ఉయ్యాలపై నుంచి నేలపైకి విసిరి నా సినిమాలు చేస్తూ చిరంజీవి ఇష్టమని చెబుతావా అని అన్నారని ఆమె కామెంట్లు చేశారు.కొంతసేపు అయిన తర్వాత మోహన్ బాబు నవ్వుకున్నారని శ్రేష్ట పేర్కొన్నారు.శ్రేష్ట చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube