టాలీవుడ్ ప్రముఖ నటులలో ఒకరైన కృష్ణంరాజు ఈ నెల 11వ తేదీన మృతి చెందిన సంగతి తెలిసిందే.కృష్ణంరాజు మరణవార్త అభిమానులను ఎంతగానో బాధ పెట్టింది.
ప్రముఖ నటి శివపార్వతి ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.నాటకం అనేది కేవలం వినోదం కాదని ఆమె చెప్పుకొచ్చారు.
ఏం చెప్పాలనుకున్నా ప్రజల్లోకి వెళ్లడం చెప్పడం నాటకానికి చేతనవుతుందని శివపార్వతి కామెంట్లు చేశారు.
రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ ను నేను చూశానని ఆ విషయంలో నేను కూడా ఏకీభవిస్తానని ఆమె చెప్పుకొచ్చారు.
కృష్ణంరాజు లెజెండ్ అని రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా వాళ్లు హీరోలుగా ఉన్నారని శివపార్వతి కామెంట్లు చేశారు.కృష్ణంరాజు గారు పర్సనల్ లైఫ్ ను తక్కువగా అనుభవించారని నేను అనుకుంటున్నానని శివపార్వతి చెప్పుకొచ్చారు.
కృష్ణంరాజు గారు సినిమా రంగం కోసం ఇంత సేవ చేసినా కనీస గౌరవం ఇవ్వలేదని ఆమె అభిప్రాయపడ్డారు.
షూటింగ్ ఆపొచ్చు కదా అని నేను ఫెడరేషన్ కు చెప్పలేదని కానీ చేసి ఉంటే బాగుండేదని శివపార్వతి అన్నారు.
కనీసం హాఫ్ డే షూటింగ్ ఆపి ఉన్నా బాగుండేదని ఆమె తెలిపారు.

అలా జరగకపోవడం నిజంగా చింతించాల్సిన విషయం అని శివపార్వతి చెప్పుకొచ్చారు.అసిస్టెంట్లకు ఆర్టిస్టులు సొంతంగా రెమ్యునరేషన్ ఇవ్వడం తన దృష్టిలో కరెక్ట్ అని శివపార్వతి వెల్లడించారు.
ఈ విషయంలో ప్రొడ్యూసర్స్ తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని నేను భావిస్తున్నానని శివపార్వతి చెప్పుకొచ్చారు.
అసిస్టెంట్ కు ఎంత ఇవ్వాలో మేము డిమాండ్ చేసేవాళ్లం కాదని శివపార్వతి అన్నారు.శివపార్వతి చేసిన కామెంట్లు నిజమేనని నెటిజన్ల నుంచి కామెంట్లు వైరల్ అవుతుండగా ఆ కామెంట్లపై ఇండస్ట్రీ పెద్దలు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.