తెలుగు సినిమా ప్రేక్షకులకు నటి షకీలా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.శృంగార తారగా ఈమె గుర్తింపు తెచ్చుకుంది.
ఎక్కువ శాతం శృంగార సన్నివేశాలలో బోల్డ్ సన్నివేశాలలో నటించడంతో ఈ మనసు శృంగార తారగానే గుర్తు పెట్టుకున్నారు అభిమానులు.ఇకపోతే షకీలా( Shakeela ) తెలుగు తమిళ, మలయాళ భాషల్లో నటించి మెప్పించిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం సినిమాలకు దూరం ఉంటున్న షకీలా ఇటీవలే తెలుగులో బిగ్ బాస్ సీజన్ 7లో పాల్గొన్నారు.తన గేమ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు షకీలా.
ఇదిలా ఉంటే షకీలా పై దాడి జరిగిందని తెలుస్తోంది.
దాంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.షకీలా పై దాడి చేసింది మరెవరో కాదు.ఆమె పెంచుకుంటున్న కూతురు శీతల్( Sheetal ).పెంచుకున్న కూతురే తన పై దాడి చేయడంతో షకీలా ఆమె పై పోలీసులకు ఫిర్యాదు చేసింది.అసలేం జరిగిందంటే.
షకీలా చాలా కాలంగా శీతల అనే ఆవిడను పెంచుకుంటున్నారు.కూతురిలా చూసుకుంటున్న ఆమె ఊహించని విధంగా షకీలా పై దాడి చేసింది.
కుటుంబ వ్యవహారాల్లో మనస్పర్థలు రావడంతో శీతల్ ఇంటినుంచి వెళ్లిపోయిందని తెలిపారు షకీలా.నిన్న ఉదయం ఇంటి నుంచి వెళ్ళిపోయిన ఆమె తన తల్లితో తిరిగి వచ్చిందని తాను సర్దిచెప్పే ప్రయత్నం చేయగా తన పై తల్లితో కలిసి దాడి చేసిందని షకీలా పోలీసులకు తెలిపారు.
అంతే కాదు గొడవ జరిగిన సమయంలో అక్కడే ఉన్న లేడీ లాయర్ పై శీతల్ ఆమె తల్లి అసభ్యకరంగా మాట్లాడారని పోలీసులకు తెలిపారు షకీలా.షకీలా పోలీసులకు ఫిర్యాదు చేయగా అదే పోలీస్ స్టేషన్ లో శీతల్ కూడా షకీలా పై ఫిర్యాదు చేసింది.ఇద్దరు ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కొందరు శీతల్ పై మండిపడుతున్నారు.పాలు పోసిన వారిని కాటేయడం అంటే ఇదేనేమో అంటూ కామెంట్ చేస్తున్నారు.