Rekha Boj: వరల్డ్ కప్ లో ఇండియా గెలిస్తే వైజాగ్ బీచ్ లో స్ట్రికింగ్ చేస్తా.. నటి కామెంట్స్ వైరల్..!!

తాజాగా క్రికెట్ వరల్డ్ కప్ (Cricket World Cup) జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే.అయితే ఈ వరల్డ్ కప్ లో ఇండియా అన్ని మ్యాచ్ లు గెలుస్తూ ఉవ్వెత్తున దూసుకుపోతుంది.

 Actress Rekha Boj Bold Comments Over India Won World Cup-TeluguStop.com

ఇక ఈ నేపథ్యంలోనే సెమీఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ తో తలపడి 70 పరుగుల తేడాతో ఇండియా (India) ఘన విజయం సాధించింది.దీంతో ఇండియా పై చాలామంది అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇక వరల్డ్ కప్ కూడా గెలవాలని ఎంతోమంది పూజలు కూడా చేస్తున్నారు.ఇదిలా ఉంటే ఓ హీరోయిన్ ఇండియా వరల్డ్ కప్ లో కప్పు కొడితే నేను వైజాగ్ బీచ్ లో( Vizag Beach ) స్ట్రికింగ్( Streaking ) చేస్తా అంటూ ఒక సంచలన పోస్ట్ పెట్టింది.

ప్రస్తుతం ఆమె పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు.

అసలు విషయం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.నటి రేఖా బోజ్ (Rekha Boj) అంటే చాలామందికి తెలియకపోవచ్చు.

కానీ ఎంతో కొంత పేరు మాత్రం ఇండస్ట్రీలో సంపాదించింది.ఇక ఈమె తెలుగు అమ్మాయి కావడంతో అవకాశాలు ఎక్కువగా ఇవ్వడం లేదని ఇప్పటికీ బాధపడుతూనే ఉంటుంది.

వైజాగ్ కి చెందిన రేఖా బోజ్ కాత్సాయిని, దామిని విల్లా (Damini Villa) వంటి సినిమాల్లో నటించింది.

Telugu Cricket Cup, Damini Villa, India, India Cup, Kaathyayan, Poonam Pandey, R

అయితే తనకు ఎక్కువగా చాన్సులు రాకపోవడంతో వైజాగ్ లోనే సొంతంగా ఒక స్టూడియో పెట్టుకొని కవర్ సాంగులు చేస్తూ రాణిస్తోంది.అయితే ఆ మధ్యకాలంలో పూనమ్ పాండే (Poonam Pandey) ఇంకా మరి కొంతమంది మోడల్స్ ఇండియా ప్రపంచ కప్ గెలిస్తే బట్టలిప్పి తిరుగుతాం అంటూ సంచలన స్టేట్మెంట్లు ఇచ్చి వైరల్ అయ్యారు.అయితే వారిలాగా ఇప్పుడు రేఖ బోజ్ కూడా ఫేమస్ అవ్వడం కోసమే ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తుంది అని పలువురు కామెంట్లు పెడుతున్నారు.

Telugu Cricket Cup, Damini Villa, India, India Cup, Kaathyayan, Poonam Pandey, R

కానీ ఈ కామెంట్లకు రేఖ స్పందిస్తూ అలాంటిదేమీ లేదు క్రికెట్ అంటే ఎమోషన్. అలాంటప్పుడు బట్టలిప్పి తిరగడంలో ఎలాంటి తప్పులేదు.నేను నా మనస్ఫూర్తిగా వరల్డ్ కప్ లో ఇండియా గెలవాలని కోరుకుంటున్నాను.అందుకే ఈ స్టేట్మెంట్ ఇచ్చాను అంటూ చెప్పుకొస్తుంది.ఇక రేఖ బోజ్ పెట్టిన స్టేట్మెంట్ కి చాలామంది నెటిజన్లు బోల్డ్ కామెంట్లు పెడుతున్నారు.ఇక వారు పెట్టే కామెంట్లకు కూడా రేఖ భోజ్ (Rekha Boj) రిప్లై ఇస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube