వెండితెర నటిగా తెలుగు ప్రేక్షకులను సందడి చేసినటువంటి నటి పూర్ణ (Purnaa)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తెలుగు వెండితెరపై అలాగే బుల్లితెరపై కూడా పలు కార్యక్రమాల ద్వారా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేసిన ఈమె గత ఏడాది దుబాయ్ కి చెందిన వ్యాపారవేత్త ఆసిఫ్ అలీ అనే వ్యక్తిని వివాహం చేసుకొని కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు.
ఇలా పెళ్లయిన వెంటనే ఈమె ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే పిల్లలను కూడా ప్లాన్ చేసుకున్నారు.ప్రస్తుతం ఈమె 9 నెలల గర్భిణి (9 Months Pregnant) అనే విషయం కూడా సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.
మరి కొద్ది రోజులలో పూర్ణ పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు.
ఇలా నెలలు నిండిన మహిళ తన ఆరోగ్యం పట్ల కడుపులో పెరుగుతున్న బిడ్డ పట్ల ఎంతో ఆందోళన చెందుతూ తమ బిడ్డను కాపాడుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంటారు.అయితే పూర్ణ మాత్రం తాజాగా చేసిన ఒక పని కారణంగా నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యారు.ఇంతకీ ఈమె ఏం చేశారనే విషయానికి వస్తే… పూర్ణ 9 నెలల గర్భంతోను నాని(Nani) కీర్తి సురేష్ (Keerthi Suresh) జంటగా నటించిన దసరా సినిమా(Dasara Movie) లోని చమ్కీల అంగీలేసి అనే పాటకు డాన్స్ చేశారు.
ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న విషయం మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే ఎంతోమంది ఈ పాటకు డాన్స్ చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఈ క్రమంలోనే నటి పూర్ణ సైతం ఈ పాటకు డాన్స్ చేసి ఆ వీడియోని ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేయడంతో ఈ వీడియో వైరల్ గా మారింది.ఇది చూసినటువంటి నెటిజన్స్ ఇలా తొమ్మిది నెలల గర్భంతో ఇలాంటి డ్యాన్సులు చేయడం అవసరమా? ఈ సమయంలో ఇలాంటి పనులు చేయకూడదని తెలియదా? అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.