పునీత్ రాజ్ కుమార్ పచ్చబొట్టు వేయించుకున్న నటి నమ్రత.. సోషల్ మీడియాలో వైరల్!

కన్నడ స్టార్ హీరో దివంగత నటుడు అయిన పునీత్ రాజ్ కుమార్ గురించి మనందరికి తేలిసిందే.

పునీత్ రాజ్ కుమార్ మరణించి ఆరు నెలలు కావస్తున్న కూడా ఆయన మరణ వార్తను ఇప్పటికీ అభిమానులు కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు.

ఎక్కడ చూసినా కూడా పునీత్ జ్ఞాపకాలే ఉండడంతో ఆయనను తలచుకొని మరింత కుమిలిపోతున్నారు కన్నడిగులు.గత ఏడాది అక్టోబర్ 29న పునీత్ రాజ్ కుమార్ మరణించిన విషయం తెలిసిందే.

పునీత్ భౌతికకాయానికి కేవలం శాండల్ వుడ్ సినీ ప్రముఖులే కాకుండా అన్ని ఇండస్ట్రీల ప్రముఖులు నివాళులు అర్పించారు.ఇంకా చెప్పాలి అంటే ఆయన మరణ వార్త విన్న కొందరు అభిమానులు గుండెలు విలసేలా రోదించగా,మరికొందరు అభిమానుల గుండెలు ఆ వార్త విని ఆగిపోయాయి.

అంతలా ఆయన ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికి చెరగని ముద్రను వేసుకున్నారు.అయితే ఇప్పటికే ఎంతో మంది అభిమానులు పునీత్ పేరును, ఫొటోలను టాటూ వేయించుకున్నారు.

Advertisement

తాజాగా కూడా అలాంటి ఘటన చోటు చేసుకుంది.పునీత్ రాజ్ కుమార్ మీద ఉన్న అభిమానాన్ని కేవలం సామాన్యులే కాకుండా నటీనటులు కూడా వారి అభిమానాన్ని చాటుకుంటున్నారు.

ఈ క్రమంలోనే కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఒక నటి ఏకంగా ఆయన పేరును టాటూ వేయించుకుంది.

ఆమె ఎవరో కాదు కన్నడ టీవీ నటి నాగిని 2 సీరియల్ ఫేమ్ నమ్రత గౌడ్. ఈమె పునీత్ కీ వీరభిమాని కావడంతో ఆయన పేరుని ఏకంగా చేతిపై టాటూ చేయించుకుంది.పునీత్ జయంతి సందర్భంగా వేయించుకున్న టాటూని నమ్రత షేర్‌ చేస్తూ ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారు అంటూ క్యాప్షన్‌ జోడించింది.

దీంతో ఆమె పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.ఇక ఈ పోస్ట్ చూసిన పునీత్ అభిమానులు ఒకవైపు ఆయన అభిమానులు చేస్తున్న పనులకీ ఆనందం వ్యక్తం చేస్తూనే మరోవైపు ఆయన లేరన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు.

కూతురి పెళ్లి వీడియో షేర్ చేసిన అర్జున్ సర్జా... మాటలు రావడం లేదంటూ పోస్ట్?
Advertisement

తాజా వార్తలు