Nainisha Rai : తిండి కోసం రక్తాన్ని అమ్ముకున్న రోజులు ఉన్నాయి.. ప్రముఖ సీరియల్ నటి కామెంట్స్ వైరల్!

బుల్లితెరపై బ్రహ్మముడి సీరియల్( Brahmamudi ) ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న సెలబ్రిటీలలో నైనిషా రాయ్ ఒకరు.సినిమాలపై ఉన్న ఆసక్తితో బెంగాళీ నుంచి హైదరాబాద్ కు వచ్చేసిన ఈ బ్యూటీ సీరియల్ ఆఫర్లతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు.

 Actress Nainisha Rai Emotional Comments Goes Viral In Social Media-TeluguStop.com

శ్రీమంతుడు అనే సీరియల్ లో నైనిషా రాయ్ లీడ్ రోల్ లో నటించి మెప్పించారు.హంసగీతం, ఇంటిగుట్టు, భాగ్యరేఖ, వంటలక్క, కలిసి ఉంటే కలదు సుఖం సీరియల్స్ నైనిషకు మంచి పేరును తెచ్చిపెట్టాయి.

Telugu Brahmamudi, Nainisha Rai, Srimanthudu, Tollywood-Movie

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నైనిషా రాయ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొత్తలో తినడానికి తిండి లేక ఇబ్బందులు పడ్డానని అన్నారు.ఆకలి తీర్చుకోవడానికి నేను బ్లడ్ డొనేషన్( Blood donation ) కూడా చేశానని నైనిషా రాయ్ వెల్లడించారు.బుల్లితెర సీరియళ్లలో ఆఫర్లు వచ్చాయని సంతోషించిన సమయంలో అవతలి వ్యక్తులు నాకేంటి అని అడగడంతో కెరీర్ పరంగా ఇబ్బందులను ఎదుర్కొన్నానని ఆమె తెలిపారు.

Telugu Brahmamudi, Nainisha Rai, Srimanthudu, Tollywood-Movie

ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తాను ఇంటికి తిరిగి వెళ్లలేదని నైనిషా రాయ్( Nainisha Rai ) పేర్కొన్నారు.నేను ఇంటికి వెళ్లినా కూడా నన్ను ఇంటికి తిరిగి రానివ్వరని ఆమె చెప్పుకొచ్చారు.నా పేరెంట్స్ కు ఇష్టం లేకపోయినా విబేధించి మరీ ఇండస్ట్రీకి వచ్చానని నైనిషా రాయ్ వెల్లడించడం గమనార్హం.

ఆ సమయంలో ఏం చేయాలో నాకు దిక్కు తోచలేదని ఆమె కామెంట్లు చేశారు.తాను ఆత్మహత్యకు కూడా ప్రయత్నించానని ఆమె చెప్పుకొచ్చారు.ఇప్పటికీ తల్లీదండ్రులు నాతో మాట్లాడటం లేదని నైనిషా రాయ్ ఎమోషనల్ అయ్యారు.ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా ఇప్పుడు వరుస ఆఫర్లు వస్తుండటం సంతోషాన్ని కలిగిస్తోందని నైనిషారాయ్ తెలిపారు.

నైనిషారాయ్ వెల్లడించిన విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.నైనిషా రాయ్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది.

నైనిషా రాయ్ రెమ్యునరేషన్ ప్రస్తుతం భారీ రేంజ్ లో ఉందని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube