సినీ ఇండస్ట్రీ లోకి చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టి అనంతరం స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటి మీనా ( Meena ) ఒకరు.ఈమె సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగారు.
ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి మీనా ప్రస్తుతం ఒంటరిగా గడుపుతున్న సంగతి తెలిసిందే.గత ఏడాది తన భర్త విద్యాసాగర్ ( Vidya Sagar )అనారోగ్య సమస్యల బారిన పడి మరణించారు.
తన కూతురితో కలిసి ఉంటున్నటువంటి ఈమె రెండో పెళ్లి చేసుకోబోతున్న అంటూ తరచు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి.

ఇలా తన రెండో పెళ్లి గురించి వస్తున్నటువంటి వార్తలపై ఇది వరకు ఎన్నోసార్లు మీనా స్పందించి క్లారిటీ ఇచ్చారు.అయితే తాజాగా మరోసారి ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొని తన రెండో పెళ్లి ( Second marriage ) గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇటీవల కాలంలో తన రెండో పెళ్లి గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి అంటూ ఈమె పెళ్లి వార్తలపై ఫైర్ అయ్యారు.

సోషల్ మీడియా రోజుకు చాలా దారుణంగా తయారవుతుందని ఈమె మండిపడ్డారు.డబ్బులు వస్తున్నాయంటే ఏమైనా రాస్తారా ఇలా వార్తలు రాసేముందు నిజానిజాలు తెలుసుకోరా అంటూ ఈమె మండిపడ్డారు.ఇదివరకే నేను నా రెండో పెళ్లి గురించి చాలా సార్లు స్పందించాను ఇప్పుడు కూడా చెబుతున్నాను.నాకు ప్రస్తుతానికి రెండో పెళ్లి చేసుకోవాలని ఆలోచన ఏమాత్రం లేదు ఒకవేళ అలాంటి ఆలోచనలు కనుక వస్తే ముందుగా మీకే అన్ని విషయాలు చెబుతాను.
అప్పటివరకు ఎవరు నా గురించి ఎలాంటి రూమర్లను స్ప్రెడ్ చేయకండి నా గురించి ఎవరు కూడా ఆలోచించకండి అంటూ ఈ సందర్భంగా మీనా ఘాటుగా సమాధానం ఇచ్చారు.







