కొన్ని కొన్ని సార్లు సినీ ఇండస్ట్రీలో నిర్మాతలు నటీనటులకు డబ్బులు ఇవ్వడానికి ఇబ్బంది పెడుతూ ఉంటారు.కొందరి నిర్మాతలు సమయానికి డబ్బులు ఇచ్చినప్పటికీ మరి కొంతమంది నిర్మాతలు సినిమా పూర్తయి విడుదలైన తర్వాత కూడా డబ్బులు కూడా ఇవ్వరు.
అలా చాలామంది నటీనటులు మీడియా ముందుకు వచ్చి చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ఇప్పటికి చాలామంది నటీనటులు ప్రొడ్యూసర్ డబ్బులు ఇవ్వటంలో ఇబ్బంది పెట్టడంతో మళ్లీ వాళ్లను డబ్బులు అడగటం అనవసరమని వదులుకున్నారు కూడా.
అందులో మరో నటి లిరీష కూడా.చాలామందికి నటి లిరీష అంటే తెలియదు కానీ.ఇటీవలే పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాలో పోలీస్ పాత్రలో నటించిన నటి అంటే ఎవరైనా గుర్తుపడతారు.
ఇక ఈమె వెండితెర పైనే కాకుండా బుల్లితెరపై కూడా పలు సీరియల్స్ లలో చేసింది.
ఇక చాలా వరకు ఈమె నెగటివ్ పాత్రలలో చేసింది.బుల్లితెరపై మాత్రం చాలా వరకు నెగటివ్ పాత్రలలో చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఇక వెండితెరపై కూడా కొన్ని సహాయక పాత్రలతో పాటు కొన్ని నెగటివ్ రోల్స్ కూడా చేసింది.ఇక ప్రస్తుతం ఆమె పలు వెబ్ సిరీస్ లలో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది.
అయితే ఇదంతా పక్కన పెడితే ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొనగా అందులో తన గురించి కొన్ని విషయాలు పంచుకుంది.ఇక తను లావుగా ఉండటం వల్ల తనను బాడి షేమింగ్ చేశారు అని తెలిపింది.తనకు చాలా వరకు నెగటివ్ పాత్రలలో నటించడం ఇష్టమని.ముఖ్యంగా తమిళ భాషతో పాటు ఇతర భాషలలో కూడా నటించడం ఇష్టమని కానీ అవకాశాలు రాలేవని తెలిపింది.
ఇక తనకు పలు సీరియల్స్ లలో కూడా మంచి గుర్తింపు వచ్చిందని తెలిపింది.ఇక ఈమె కూడా అందరు ఎదుర్కొన్నట్లు తాను కూడా డబ్బులు ఏ విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొందట.
అది కూడా ప్రొడ్యూసర్ల దగ్గర.తను ఒక సినిమాలో నటించినప్పుడు ఆ ప్రొడ్యూసర్ తనకు డబ్బులు ఇవ్వలేదని.అడ్వాన్స్ ఇచ్చాడు కానీ మిగిలినది ఇవ్వలేదని తెలిపింది.
తను ఎన్నిసార్లు అడిగే ప్రయత్నం చేసిన అతను రెస్పాండ్ అవ్వలేదు అంటూ.ఆ ప్రొడ్యూసర్ పై తను అరిచిన రోజులు కూడా ఉన్నాయంటూ.కానీ ఆయన మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు అంటూ ఇక చివరికి ఆ డబ్బులు రావని తనే వదులుకున్నాను అని తెలిపింది.
అంతేకాకుండా అల్లు అర్జున్ నటించిన వరుడు సినిమాలో ఒక 40 రోజులు నటించాను అంటూ ఆ సమయంలో కూడా డబ్బులు రాలేవని తెలిపింది.అలా తను పారితోషకం విషయంలలో సినిమాలతో పాటు సీరియల్ లలో కూడా చాలా డబ్బులు వదులుకున్నాను అని తెలిపింది.
ఇక ప్రస్తుతం ఆ వీడియో యూట్యూబ్లో వైరల్ గా మారింది.