టాలీవుడ్ ప్రముఖ నటీమణులలో ఒకరైన లయ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన ఆస్తుల గురించి షాకింగ్ కామెంట్లు చేయడంతో పాటు ఇతర ఆసక్తికర విషయాలను వెల్లడించారు.వేణుగారితో స్వయంవరం సినిమాలో కలిసి నటించానని ఆ తర్వాత కళ్యాణరాముడు సినిమాలో వేణుతో కలిసి నటించే అవకాశం వచ్చిందని ఆమె చెప్పుకొచ్చారు.
ఆ సినిమాకు బల్క్ డేట్స్ అడగటం వల్ల నో చెప్పానని లయ తెలిపారు.
షిఫ్ట్ చేసి డేట్స్ కావాలని అడిగి ఉంటే మాత్రం ఆ సినిమాలో నేను నటించి ఉండేదానినేమో అని లయ అన్నారు.
నువ్వులేక నేనులేను సినిమాలోని నా పాత్ర కావాలని అబ్లిగేషన్ తో చేసిన రోల్ అయితే కాదని లయ కామెంట్లు చేశారు.సురేష్ ప్రొడక్షన్స్ తో ఉన్న అనుబంధం వల్ల ఆ సినిమాలో నటించానని ఆమె చెప్పుకొచ్చారు.
అప్పటికే ఆ బ్యానర్ లో సినిమాలు చేయడంతో నో అని చెప్పలేకపోయానని లయ తెలిపారు.
నేను నిజంగా పాత్రకు సూట్ అయితే నాకు ఆఫర్లు ఇస్తారని నాకు అనిపించిందని ఆమె కామెంట్లు చేశారు.పీఆర్ కూడా ఇంపార్టెంట్ అని అనిపిస్తుందని లయ పేర్కొన్నారు.హనుమాన్ జంక్షన్ సినిమాలో చివరి నిమిషంలో యాడ్ అయ్యానని ఆమె చెప్పుకొచ్చారు.
జగపతిబాబు గారి వల్ల ఆ మూవీలో ఛాన్స్ దక్కిందని లయ పేర్కొన్నారు.నేను అవకాశాలు అడిగి ఇబ్బంది పెడతానేమో అని అనిపిస్తుందని అందుకే అడగనని ఆమె కామెంట్లు చేశారు.
ఇప్పుడు నంబర్లు తెలుసుకొని మెసేజ్ లు పెట్టాలని లయ అన్నారు.నేను అంబానీ సిస్టర్ అని లయ చెప్పుకొచ్చారు.టాటా మనవరాలినని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయని ఓన్ ఫ్లైట్ లో ఇక్కడికి వచ్చానని లయ కామెంట్లు చేశారు.ఫ్లైట్ లో నుంచి నా ఆస్తులు చూపిస్తున్నానని ఆమె సరదాగా చెప్పుకొచ్చారు.
నిజంగా ఉన్న ఆస్తుల గురించి స్పందిస్తూ మా కుటుంబానికి బాగానే ఆస్తులు ఉన్నాయని అయితే వేల కోట్ల రూపాయల ఆస్తులు మాత్రం లేవని లయ కామెంట్లు చేశారు.