ఇండస్ట్రీ వదిలి వెళ్లే లోపు వారితో సినిమా చేయడమే నా కల... కీర్తి సురేష్ కామెంట్స్ వైరల్!

కీర్తి సురేష్ ( Keerthy Suresh ) పరిచయం అవసరం లేని పేరు దక్షిణాది సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి కీర్తి సురేష్ ప్రస్తుతం తమిళ తెలుగు భాషలలో సినిమా అవకాశాలను అందుకొని ఎంతో బిజీగా ఉన్నారు.ఇక చివరిగా ఈమె తెలుగులో నాని హీరోగా నటించిన దసరా( Dasara ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

 My Dream Is To Do A Film With Them Before I Leave The Industry, Keerthy Suresh,-TeluguStop.com

ఇందులో వెన్నెల పాత్రలో కీర్తి సురేష్ జీవించేసారని చెప్పాలి.ఇలా ఈ సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఈమె ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

Telugu Bhola Shankar, Keerthy Suresh, Sanjayleela, Sharukh Khan-Movie

తెలుగు తమిళ భాష చిత్రాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి కీర్తి సురేష్ త్వరలోనే భోళా శంకర్ ( Bhola Shankar ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.మెగాస్టార్ చిరంజీవి తమన్న జంటగా నటించిన ఈ సినిమాలో ఈమె చిరంజీవికి చెల్లెలి పాత్రలో నటించారు.ఈ సినిమా ఆగస్టు 11వ తేదీ విడుదల కాబోతోంది.ఇలా కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె త్వరలోనే బాలీవుడ్ ఇండస్ట్రీకి కూడా వెళ్లబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి.

Telugu Bhola Shankar, Keerthy Suresh, Sanjayleela, Sharukh Khan-Movie

ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి కీర్తి సురేష్ బాలీవుడ్ ఎంట్రీ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఈ సందర్భంగా ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో నటించడం గురించి మాట్లాడుతూ తనకు ఎప్పటినుంచో ఒక కోరిక ఉందని తెలిపారు.తాను సినీ ఇండస్ట్రీ నుంచి తప్పుకునే లోపు ఒక్కసారైనా బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ ( Sharukh Khan ) తో కలిసి సినిమా చేయాలని అలాగే డైరెక్టర్ సంజయ్ లీల బన్సాలీ దర్శకత్వంలో ఓ సినిమా అయినా చేయాలి అనే కోరిక ఉంది అంటూ తన మనసులో మాట బయటపెట్టారు.ఇలా బాలీవుడ్ సినిమాల గురించి ఈమె ఇలాంటి కామెంట్ చేయడంతో కీర్తి సురేష్ ఈరోజు కాకపోయినా త్వరలో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయమని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube