ప్రముఖ నటి జమున ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

ప్రముఖ సినీ నటి జమున వెండితెర సత్యభామగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారనే సంగతి తెలిసిందే.తెలుగు, హిందీతో పాటు ఇతర దక్షిణాది భాషల్లో నటించి పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్న జమున ఎన్నో సినిమాలలో విలక్షణమైన పాత్రలలో నటించి ఆ పాత్రలలో తనను తప్ప మరెవరినీ ఊహించుకోలేనంత అద్భుతంగా నటించి తన నటనతో మెప్పించడం గమనార్హం.

 Actress Jamuna Assets Value Details Here Goes Viral In Social Media , Actress Ja-TeluguStop.com

తెలుగింటి సత్యభామ ఎవరనే ప్రశ్నకు తెలుగు సినీ ప్రేక్షకులు ఎవరైనా వెంటనే జమున పేరును సమాధానంగా చెబుతారు.పదుల సంఖ్యలో సినిమాలలో సావిత్రికి చెల్లి పాత్రలో జమున నటించి మెప్పించారు.

అలనాటి స్టార్ హీరోలందరికీ జోడీగా జమున నటించడం గమనార్హం.ఎన్టీఆర్, ఏఎన్నార్ జమునకు అవకాశాలు ఇవ్వని సమయంలో కూడా ఆమె 18 సినిమాలలో నటించారంటే ఆమె స్థాయి ఏంటో సులువుగానే అర్థమవుతుంది.

Telugu Crore, Actress Jamuna, Jamuna, Ramana Rao, Satya Bhama, Sravanti, Vamsi-M

వినాయక చవితి అనే సినిమాలో తొలిసారి సత్యభామ రోల్ లో నటించి జమున మెప్పించడం గమనార్హం.శ్రీ కృష్ణ తులాభారం సినిమాలో కూడా జమున సత్యభామ రోల్ లో కనిపించి ఆకట్టుకున్నారు.జమున నటిగా భారీ స్థాయిలోనే ఆస్తులు కూడబెట్టారు.జమున ఆస్తుల విలువ 50 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉంటుందని తెలుస్తోంది.ఆమెకు జూబ్లీహిల్స్ లో ఖరీదైన భవంతి ఉంది.

Telugu Crore, Actress Jamuna, Jamuna, Ramana Rao, Satya Bhama, Sravanti, Vamsi-M

ఈ భవంతి 2000 గజాలు ఉందని సమాచారం అందుతోంది.కొండాపూర్ లో ఒక ఫ్లాట్ తో పాటు ఈమెకు పాత బంగ్లా కూడా ఉంది.జమున చేసిన సేవా కార్యక్రమాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.

జమున పలు వివాదాల ద్వారా వార్తల్లో నిలిచినా తన తప్పు ఉంటే ఆమె క్షమాపణలు చెప్పేవారు.జమున భర్త పేరు రమణారావు కాగా ఈ దంపతులకు వంశీ, స్రవంతి జన్మించారు.

కొడుకు ప్రస్తుతం అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారని సమాచారం అందుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube