అభినయ (Abhinaya) పరిచయం అవసరం లేని పేరు తెలుగు చిత్ర పరిశ్రమకు నేనింతే సినిమా ద్వారా పరిచయం అయినటువంటి ఈమె అనంతరం శంభో శివ శంభో, డమరుకం, రాజుగారిగది2, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో నటించే పెద్ద ఎత్తున ప్రేక్షకులను మెప్పించారు.తాజాగా విశాల్ (Vishal) హీరోగా నటించిన మార్క్ ఆంటోని (Mark Antony) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
పుట్టుకతోనే చెవిటి మూగ సమస్యలతో జన్మించినటువంటి అభినయశ్రీ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు.అయితే ఇలాంటి లోపాలు ఉన్నటువంటి ఒక అమ్మాయి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి ఈ స్థాయిలో సక్సెస్ అందుకుంది అంటే అది మామూలు విషయం కాదు అని చెప్పాలి.

తాజాగా అభినయశ్రీ తన తండ్రితో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూ సందర్భంగా అభినయ తండ్రి(Abhinaya Father) తన గురించి ఎన్నో విషయాలను వెల్లడించారు.నా కూతురు చూడటానికి చాలా అందంగా ఉంటుంది కానీ పుట్టుకతోనే చెవిటి మూగ సమస్యలతో బాధపడిందని తెలియజేశారు.ఆమె కేవలం సైగల ద్వారా మాత్రమే తన భావాలను తెలియజేయగలరని తెలియజేశారు.
ఇక నటనపై ఎంతో ఆసక్తి ఉన్నటువంటి తనని ముందుగా మోడలింగ్ రంగంలోకి పంపించాము.ఆ సమయంలో తన తల్లి దగ్గరుండి అన్ని చూసుకుందని తెలిపారు.

కుమార్తెను తీసుకొని నేను సినిమా అవకాశాల కోసం కొందరి వద్దకు వెళ్ళగా వారు చెవిటి మూగ సమస్యతో బాధపడే అమ్మాయి సినిమాలలోకి రావడం ఏంటి నీకేమైనా పిచ్చా అంటూ తనని హేళన చేశారు.అయితే ఈరోజు మా అమ్మాయి స్థాయిలో ఉంది అంటే అందుకు కారణం సముద్రఖని( Samudrakhani ) అని అభినయ తండ్రి వెల్లడించారు.ఇలా ఎన్నో సమస్యలతో జన్మించిన తన కుమార్తె నేడు ఈ స్థాయిలో ఉండి అందరితో కలిసి పోతుందని తాను అసలు ఊహించుకోలేదని తెలియజేశారు.ఇక మార్క్ ఆంటోనీ సినిమాలో ఈమె నటించిన సమయంలో విశాల్ తో తన పెళ్లి జరగబోతుంది అంటూ వార్తలు వచ్చాయి.
అయితే ఈ వార్తలపై ఈ సందర్భంగా స్పందిస్తూ ఆయన వంక చూసి నేను నవ్వడం వల్లే ఈ వార్తలు వచ్చాయని ఈమె తన భాషలో తెలిపారు.పెళ్లి గురించి ఇప్పుడే ఆలోచన చేయలేదని, తనను చేసుకునే వ్యక్తి ముందుగా నన్ను అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు.