హీరో అఖిల్ వల్ల ప్రముఖ నటి ఆమనికి సొంతమైన ఈ రేర్ రికార్డ్ గురించి తెలుసా?

ప్రముఖ టాలీవుడ్ నటి ఆమని( Aamani ) గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

ఆమని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను చిన్నప్పుడు చాలా అల్లరి చేసేదానినని ఆమె తెలిపారు.

రాత్రి 12 గంటల సమయంలో కజిన్స్ ను నిద్ర లేపి మొత్తం పూలు కట్ చేసేదానినని ఆమని పేర్కొన్నారు.దొంగతనం చేసిన పూలను పెట్టుకోలేమని పెట్టుకుంటే తెలిసిపోతుందని ఆమె తెలిపారు.

జామకాయలు, సీతాఫలాలు కూడా దొంగతనం చేసేదానినని అమని చెప్పుకొచ్చారు.నాన్నగారు అంటే నాకు చాలా ఇష్టమని ఆమె పేర్కొన్నారు.

నాన్నకు సేవలు చేయాలని అనుకున్నానని ఆయన మరణం నన్ను బాధ పెట్టిందని ఆమని వెల్లడించారు.జంబలకిడిపంబ( Jambalakidipamba Movie ) రెమ్యునరేషన్ తో ఫస్ట్ ఫోన్ కొనుక్కున్నానని ఆమె అన్నారు.

Advertisement

మదర్ ఉన్నారని మూవీ ఆఫర్ల కోసం నాన్నను వదిలి చెన్నైకు వచ్చామని ఆమని కామెంట్లు చేశారు.ఇప్పటికీ అమ్మకు నేను కెరీర్ పరంగా బిజీగా ఉండటం ఇష్టమని ఆమె తెలిపారు.

చిన్నప్పుడు అఖిల్ పై( Akhil ) తెలియని ప్రేమ అని ఇప్పటికీ అఖిల్ ప్రేమతో మాట్లాడతాడని ఆమని అన్నారు.ఇప్పుడు అఖిల్ చాలా క్యూట్ గా ఉన్నాడని ఆమని అన్నారు.అఖిల్ చిన్న వయస్సులో ఉన్న సమయంలో సిసింద్రీ మూవీలో( Sisindri Movie ) అఖిల్ కు తల్లిగా చేశానని అఖిల్ పెద్దైన తర్వాత కూడా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లో( Most Eligible Bachelor ) తల్లిగా చేశానని ఆమె పేర్కొన్నారు.

ఈ విధంగా ఒక హీరో చిన్నప్పుడు, పెద్దయ్యాక తల్లిగా చేయడం నాకే సాధ్యమైందని ఈ రేర్ రికార్డ్ నాకే సొంతమని ఆమె తెలిపారు.

భరత్ అనే నేనులో( Bharat Ane Nenu ) మహేష్ తో చేశానని ఆమని వెల్లడించారు.ఆ సినిమా చూసి ఎంతోమంది ఫోన్ చేశారని ఆమె కామెంట్లు చేశారు.భరత్ అనే నేను కోసం కేవలం మూడు రోజులు పని చేశానని ఆమని అన్నారు.

దంతాలపై పసుపు మరకలా.. ఈజీగా ఇలా వదిలించుకోండి..!
శ్రీవారి భక్తులకు క్షమాపణలు చెప్పిన బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్!

ఆమని కెరీర్ పరంగా మరింత బిజీ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.ఆమని పారితోషికం కూడా పరిమితంగానే ఉందని తెలుస్తోంది.

Advertisement

ఆమని సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే కెరీర్ పరంగా బిజీ అయ్యే ఛాన్స్ ఉంటుంది.పాన్ ఇండియా ప్రాజెక్ట్ లలో ఆమని నటిస్తే బాగుంటుందని ఆమె తెలిపారు.

తాజా వార్తలు