నెక్స్ట్ సినిమాకు విక్రమ్ డబుల్ రెమ్యునరేషన్.. ఏకంగా ఎన్ని కోట్లంటే!

ఇప్పుడు ఎక్కడ చూసిన రెమ్యునరేషన్స్ గోలనే వినిపిస్తుంది.

ప్రతీ ఇండస్ట్రీలో కొద్దిగా స్టార్ డమ్ రాగానే అప్పటి వరకు పుచ్చుకుంటున్న రెమ్యునరేషన్ కు డబల్ రెమ్యునరేషన్ ను పెంచేస్తున్నారు.

వారి వారి స్టార్ డమ్ అండ్ క్రేజ్ చూసి నిర్మాతలు కూడా అడిగినంత ఇచ్చుకోక తప్పడం లేదు.ఇక మన సౌత్ ఇండియా ఈ మధ్య బాగా డెవలప్ అవుతుంది.

దీంతో ఒక్కసారిగా మన స్టార్స్ రెమ్యునరేషన్స్ డబుల్ చేసేస్తున్నారు.ఒకప్పుడు ప్రాంతీయ భాషల్లోనే ఈ సినిమా రిలీజ్ అయ్యేది.

కానీ ఇప్పుడు మన స్టార్స్ చేస్తున్న ప్రతీ సినిమా పాన్ ఇండియా తెరకెక్కడంతో రెమ్యునరేషన్( Remuneration ) కూడా అదే రేంజ్ లో వసూళ్లు చేస్తున్నారు.

Advertisement

ఒక్కో స్టార్ హీరో 50, 100 కోట్లను వసూళ్లు చేస్తున్నారు.ఇక తాజాగా తమిళ్ స్టార్ హీరోల్లో ఒకరైన విక్రమ్ కూడా రెమ్యునరేషన్ పెంచేసినట్టు తెలుస్తుంది.చియాన్ విక్రమ్ ( Chiyaan Vikram ) అంటే తెలియని వారు లేరు.

ఈయనకు తెలుగులో కూడా ఫ్యాన్స్ ఉన్నారు.అపరిచితుడు సినిమాతో ఈయన బాగా ఫేమస్ అయ్యి తన మార్కెట్ కూడా పెంచుకున్నాడు.

మరి విక్రమ్ ప్రజెంట్ తంగళన్ సినిమా( Thangalaan ) చేస్తున్నాడు.ఈ సినిమా టీజర్ తో ఒక్కసారిగా ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.

పా.రంజిత్ తెరకెక్కించిన ఈ సినిమాలో తన లుక్ తోనే విక్రమ్ చాలా వరకు అందరిని ఆకట్టుకున్నాడు.ఈ సినిమా 2024 జనవరి 26న రిలీజ్ కు రెడీ అయ్యింది.

రెండు స్పూన్ల బియ్యంతో హెయిర్ ఫాల్ దూరం.. ఎలా వాడాలంటే?
నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?

ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగంగా జరుపు కుంటున్న ఈ సినిమా పాన్ ఇండియా వ్యాప్తంగా ఐదు భాషల్లో రిలీజ్ కానుంది.ఇదిలా ఉండగా ఈ సినిమా కోసం విక్రమ్ 23 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారట.అయితే నెక్స్ట్ 62 ( Chiyaan62 ) సినిమాకు ఏకంగా డబుల్ రెమ్యునరేషన్ చేసినట్టు టాక్.

Advertisement

నెక్స్ట్ ఈయన అరుణ్ కుమార్ దర్శకత్వంలో చేయనుండగా ఈ సినిమా ఏకంగా 50 కోట్లు అందుకుంటున్నారట.ఈ న్యూస్ కోలీవుడ్ సర్కిల్స్ లో వైరల్ అయ్యింది.

తాజా వార్తలు