కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి( Vijay Thalapathy ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.హీరో విజయ్ కి తమిళంతో పాటు టాలీవుడ్ లో కూడా భారీగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందన్న విషయం మనందరికి తెలిసిందే.
కాగా హీరో విజయ్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే గత ఏడాది విజయ్ వారసుడు సినిమాతో( Varasudu Movie ) ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.
ఈ సినిమా తమిళంలో వారీసు పేరుతో విడుదల అయిన విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ని అందుకున్న విషయం తెలిసిందే.

గత సినిమాలు బీస్ట్, మాస్టర్ సినిమాలు కూడా పర్వాలేదు అనిపించేలా పాజిటివ్ టాక్ ని తెచ్చుకున్నాయి.ఇకపోతే విజయ్ కి ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఆయన స్టైల్, ఆటిట్యూడ్, హెయిర్ స్టైల్ కి విపరీతమైన అభిమానులు ఉన్నారు.మరి ముఖ్యంగా విజయ్ హెయిర్ స్టైల్ కి ( Vijay Hair Style ) అయితే బీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు.
విజయ్ నటించిన మాస్టర్, బీస్ట్ సినిమాలలో విజయ్ హెయిర్ స్టైల్ కి ప్రత్యేకమైన ఫ్యాన్స్ బేస్ ఉంది.కానీ విజయ్ అభిమానులు చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే విజయ్ ది ఒరిజినల్ హెయిర్ స్టైల్ కాదట.

వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇదే నిజం.విజయ్ తో పనిచేసిన ఒక డైరెక్టర్ ఇదే విషయాన్ని ఇంటర్వ్యూలో చెప్పకొచ్చాడు.డైరెక్టర్ లక్ష్మణన్ విజయ్ హెయిర్ స్టైల్ గురించి మాట్లాడుతూ.విజయ్ ది ఒరిజినల్ హెయిర్ స్టైల్ కాదు.విజయ్ ది విగ్గు కాదు కానీ,ఆయన హెయిర్ ప్లాంటేషన్ చేయించుకున్నారు అని తెలిపారు.ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చాలామంది అభిమానులు షాక్ అవుతున్నారు.
అంటే హీరో మహేష్ బాబు మాదిరిగా విజయ్ కూడా హెయిర్ ప్లాంటేషన్ చేయించుకున్నాడన్నమాట.ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
