సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది.తాజాగా డీఎండీకే అధినేత, నటుడు విజయకాంత్( Viajaykanth ) కన్నుమూసిన సంగతి తెలిసిందే.
కరోనాతో బాధపడుతున్న ఆయన మియోట్ ఆస్పత్రిలో మంగళవారం చేరారు.గురువారం ఉదయం 9 గంటల సమయంలో ఆయన తుదిశ్వాస విడిచారు.
శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన కన్నుమూసినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించారు.ఇక ఆయన మరణ వార్త తెలుసుకున్న పలువురు ప్రముఖులు రాజకీయ నాయకులు ఆయనకు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
కుటుంబ సభ్యులతో పాటు ఆయనను అభిమానించేవారు ఆయన మరణ వార్తలను జీర్ణించుకోలేకపోతున్నారు.ఈ సందర్భంగా ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు.ఇక ఆయనకు సంబంధించి సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు కూడా వినిపిస్తున్నాయి. విజయ్ కాంత్ కి తెలియని మరికొన్ని విషయాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
విజయ్ కాంత్ అసలు పేరు నారాయణన్ విజయరాజ్ అలగర్ స్వామి.ఈయన 1952 ఆగస్టు 25న జన్మించారు.27 ఏళ్ల వయసులో ఎంట్రీ ఇచ్చి 2015 వరకు నటించి మెప్పించారు.సుమారు 150కి పైగా చిత్రాల్లో నటించి, మెప్పించారు.
అటు తమిళ, ఇటు తెలుగు ప్రేక్షకులను అలరించారు.దాదాపు 20కి పైగా పోలీసు కథల్లోనే ఆయన నటించి మెప్పించారు.కెరీర్ ఆరంభంలో కాస్త పరాజయాలు అందుకున్న విజయకాంత్ ఎస్ఏ చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన దూరతు ఇడి ముళక్కం, సత్తం ఒరు ఇరుత్తరై సినిమాలతో విజయాలు అందుకున్నారు.100వ చిత్రం కెప్టెన్ ప్రభాకర్( Captain Prabhakar ) విజయం సాధించిన తర్వాత నుంచి అందరూ ఆయన్ని కెప్టెన్‌గా పిలుస్తారు.ఇక విజయకాంత్ నటించిన చాలా చిత్రాలు తెలుగులోనూ డబ్ కావడంతో ఇక్కడి వారికీ ఆయన సుపరిచితులే.ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.2005 డీఎండీకే పార్టీ( DMDK party )ని స్థాపించారు.అలాంటి ఒక మంచి వ్యక్తి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడం అన్నది నిజంగా బాధాకరమని చెప్పవచ్చు.