ఏపీలోని బీసీలకు వైసీపీ పెద్దపీట వేస్తుందని ఆ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు.వంశీకృష్ణకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని, అయితే ఆయన ఏ కారణాలతో పార్టీని వీడారో తెలియదని తెలిపారు.
త్వరలోనే సీఎం జగన్ విశాఖపట్నం నుంచి పరిపాలన చేస్తారని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.వచ్చే ఎన్నికల్లో మళ్లీ వైసీపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమ పథకాలే జగన్ ను మళ్లీ గెలిపిస్తాయని పేర్కొన్నారు.పార్టీలో ఎవరున్నా లేకపోయినా మళ్లీ జగన్ సీఎం అవుతారని స్పష్టం చేశారు.