నందమూరి హీరో తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని సోషల్ మీడియాలో జోరుగా వార్తలు ప్రచారంలోకి వస్తున్న సంగతి తెలిసిందే.అయితే తారకరత్న కోమాలో ఉన్నారని తెలుస్తోంది.
నందమూరి చైతన్య కృష్ణ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తారకరత్న ఆరోగ్య పరిస్థితికి సంబంధించి షాకింగ్ విషయాలను వెల్లడించడం జరిగింది.తారకరత్న కండీషన్ స్టేబుల్ గా ఉందని రెండు రోజులు ఆగితే తారకరత్న ఆరోగ్యం గురించి పూర్తిస్థాయిలో స్పష్టత వస్తుందని తెలిపారు.
తారకరత్న త్వరగా కోలుకోవాలని దేవుడిని కోరుకుందామని ఆయన కామెంట్లు చేయడం గమనార్హం.క్రిటికల్ పరిస్థితులు ఉన్నా మాకు హోప్ అయితే ఉందని చైతన్య కృష్ణ పేర్కొన్నారు.చంద్రబాబు గారు తారకరత్న ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారని ఆయన అన్నారు.ప్రస్తుతం తారకరత్న కోమాలో ఉన్నాడని చైతన్య కృష్ణ పేర్కొన్నారు.
ఎక్మో చికిత్స జరుగుతుందని జరిగిన ప్రచారంలో నిజం లేదని ఆయన తెలిపారు.

జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వస్తారో లేదో సమాచారం లేదని ఆయన కామెంట్లు చేశారు.తారకరత్న మెలేనా అనే అరుదైన వ్యాధితో బాధ పడుతున్నాడని వైద్యుల నుంచి సమాచారం అందుతోంది.రక్త సంబంధిత వ్యాధులు, రక్తస్రావం, రక్తనాళాల్లో వాపు, కడుపులో యాసిడ్ ఉత్పత్తి అధికంగా జరగడం, ఎగువ జీర్ణశయాంతర మార్గం దెబ్బ తిన్నా ఈ సమస్య వస్తుంది.

ఈ సమస్య బారిన పడిన వాళ్లను ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వేధిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.యాంజియొప్లాస్టి ద్వారా ప్రస్తుతం తారకరత్నకు చికిత్స చేస్తున్నారని సమాచారం.తారకరత్న త్వరగా కోలుకుని మామూలు మనిషి అవ్వాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.నటుడు తారకరత్న హెల్త్ కు సంబంధించి అప్ డేట్స్ వస్తున్నా ఆయన ఆరోగ్య స్థితి విషమంగానే ఉండటం ఫ్యాన్స్ ను బాధ పెడుతోంది.







