టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న సెలబ్రిటీలలో సురేష్( Actor Suresh ) ఒకరు.మొదట హీరోగా, తర్వాత విలన్ గా నటించిన సురేష్ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.
ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి సురేష్ మాట్లాడుతూ నా మొదటి భార్య పేరు హర్షితారెడ్డి అని తను మొదటి నుంచి ఇండస్ట్రీలోనే ఉండేదని చెప్పుకొచ్చారు.చదువుకోవాలనే కోరికతో తను నటించడం మానేసిందని సురేష్ వెల్లడించారు.
నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె తన పేరును అనితా సురేష్( Anitha Suresh ) అని మార్చుకుందని ఆయన చెప్పుకొచ్చారు.
మాకు ఓ బాబు కూడా పుట్టాడని నాతో విడాకులై రెండో పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఆమె అదే పేరు కొనసాగిస్తోందని సురేష్ వెల్లడించారు.ఒకప్పుడు నా భార్య ఇప్పుడు నా స్నేహితురాలి స్థానంలో ఉందని ఆయన తెలిపారు.వరుస మారిందేమో కానీ ఆప్యాయత మాత్రం మారలేదని సురేష్ కామెంట్లు చేశారు.
విడిపోవడానికి మా మధ్య ఎలాంటి గొడవలు జరగలేదని ఆమెకు పెద్ద చదువులు చదవాలని అమెరికా( America )లో సెటిలవ్వాలని కోరిక ఉండేదని నేను సినిమాల్లో బిజీగా ఉండటంతో తనతో రానని చెప్పేశానని అందుకే విడిపోయామని సురేష్ తెలిపారు.ఆస్తులను సమానంగా పంచుకున్నామని సురేష్ చెప్పుకొచ్చారు.
నా భార్య అమెరికా వెళ్లిపోయి అక్కడే చదువుకుందని రెండో పెళ్లి చేసుకుని అక్కడే సెటిలైందని ఆయన కామెంట్లు చేశారు.నేను కూడా దర్శకరచయిత్రి రాశి( Rashi )ని రెండో పెళ్లి చేసుకున్నానని సురేష్ చెప్పుకొచ్చారు.నేను అమెరికా వెళ్తే మొదటి భార్య ఇంట్లో ఉంటానని వాళ్లు ఇండియా వస్తే నా ఇంట్లో ఉంటారని సురేష్ కామెంట్లు చేశారు.సురేష్ వెల్లడించిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
సురేష్ కు గతంతో పోల్చి చూస్తే మాత్రం మూవీ ఆఫర్లు తగ్గాయి.