తెలుగు సినీ ఇండస్ట్రీలో పలు సినిమాలలో హీరోగా నటించిన అనంతరం ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించినటువంటి నటుడు శ్రీరామ్( Sri Ram ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన చివరిగా రవితేజ( Raviteja ) హీరోగా నటించిన రావణాసుర సినిమాలో కూడా కీలక పాత్రలో నటించి మెప్పించారు.
ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్దగా సినిమాలలో నటించకపోయిన కోలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం ఎన్నో సినిమాలలో హీరోగా నటించిన స్టార్ గా సక్సెస్ అందుకున్నారు.ఇలా హీరోగా తెలుగు తమిళ భాష చిత్రాలలో గుర్తింపు పొందినటువంటి శ్రీరామ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా శ్రీరామ్ తన సినీ కెరియర్ గురించి ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు.తన సీని కెరియర్ లో జరిగిన ఎన్నో ఒడిదుడుకుల గురించి కూడా ఈ సందర్భంగా ఈయన వెల్లడించారు.ఇక తన ఫేవరెట్ హీరోయిన్ గురించి కూడా ఈయన కొన్ని విషయాలను వెల్లడించారు.తనకు భూమిక( Bhumika ) అంటే చాలా ఇష్టమని తనే నా ఫేవరెట్ హీరోయిన్ అని ఈయన తెలియజేశారు.
ఇక భూమికతో కలిసి శ్రీరామ్ రోజాపూలు, బడీ, కన్నై నంబతే వంటి చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.భూమికతో సినిమా షూటింగ్ సమయంలో నాకు చాలా గొడవలు జరిగేవని అయితే అవన్నీ కూడా చిన్న చిన్న గొడవలేనని ఈయన తెలియజేశారు.

ఇకపోతే ఒక సినిమా షూటింగ్ సమయంలో మాత్రం భూమికను కత్తి తీసుకొని పొడిచి చంపేయాలనే అంత కోపం వచ్చిందని వీరి మధ్య జరిగినటువంటి సంఘటన గురించి కూడా తెలియజేశారు.భూమిక తాను మరొక సినిమాకి కమిట్ అయ్యాము.అయితే ఆ సినిమా షూటింగ్ సగం వరకు చేసిన భూమిక ఇక తిరిగి కనిపించలేదు చాలా రోజుల తర్వాత తనకు ఎయిర్ పోర్ట్ లో కనిపించింది.ఇలా కనిపించగానే ఆ సినిమా షూటింగ్ పూర్తి అయ్యిందా అని నన్ను ప్రశ్నించారు.
ఆ క్షణం నాకు తనని ఒక కత్తి తీసుకొని పొడిచి చంపేయాలనే అంత కోపం వచ్చిందని ఈ సందర్భంగా భూమిక గురించి శ్రీరామ్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.