టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన ప్రేమ కథ చిత్రాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా లవర్ బాయ్ గా ఎంతో మంది అమ్మాయిలకు అభిమాన హీరోగా మారిపోయిన నటుడు సిద్ధార్థ్( Siddharth ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన ఈయన కొంతకాలం పాటు తెలుగు సినిమాలకు దూరంగా ఉన్నారు.
ఐతే చాలాకాలం తర్వాత అజయ్ భూపతి ( Ajay Bhupathi)దర్శకత్వంలో మహాసముద్రం ( Mahasamudram ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా కూడా పెద్దగా ప్రేక్షకాదరణ పొందలేదని చెప్పాలి.
ఇక ఈ సినిమా అనంతరం సిద్ధార్థ్ టక్కర్(Takker) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఈ సినిమా జూన్ 9వ తేదీ తెలుగు తమిళ భాషలలో విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఒక్కసారిగా ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.ఇలా ఇంటర్వ్యూలో హీరో కన్నీళ్లు పెట్టుకొని ఏడ్చడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే ఈ ఇంటర్వ్యూ జరుగుతున్న సమయంలో సడన్ గా అక్కడకు తమిళ్ సినీ పరిశ్రమకు చెందిన సుజాత రంగరాజన్( Sujatha Rangarajan ) వచ్చారు.
అక్కడ ఆమెను చూసిన సిద్ధార్థ్ భావోద్వేగానికి గురయ్యారు.

ఇలా ఆమెను చూడగానే సిద్ధార్థ్ ఎమోషనల్ అవుతూ తన పాదాలకు నమస్కారం చేయడమే కాకుండా అనంతరం ఆమెను పట్టుకొని ఏడ్చేశారు.అయితే ఆమెను చూడగానే ఎందుకు ఈయన అంత భావోద్వేగం అయ్యారనే విషయానికి వస్తే శంకర్ దర్శకత్వంలో సిద్ధార్థ నటించిన బాయ్స్(Boys) సినిమాకు ఈయననే తీసుకోవాలని ఆమె శంకర్ ( Shankar )కి సూచించారట.ఆమె మాట ప్రకారం దర్శకుడు శంకర్ సిద్ధార్థ్ కు ఛాన్స్ ఇచ్చారు.
ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడమే కాకుండా.హీరోగా అతడి కెరీర్ టర్న్ అయ్యింది.
అందుకే ఆమెను చూడగానే ఒక్కసారిగా సిద్ధార్థ్ ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.కేవలం ఆమె కారణంగానే ఆయన ఇండస్ట్రీలో హీరోగా నేడు ఈ స్థాయిలో ఉన్నారని చెప్పాలి.
