తిరుపతి: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్‌రెడ్డితో కలిసి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తున్నారని సినీ నటుడు శివాజీ సంచలన ఆరోపణలు చేశారు.
అమరావతి రైతుల క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఆయన రైతుల పాదయాత్రకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టించిందని విమర్శించారు.
ఎన్ని అడ్డంకులు సృష్టించినా అమరావతి రైతులు ఆ కుట్రలను ఛేదించి తిరుపతి చేరుకున్నారని స్పష్టం చేశారు.
జగన్-ప్రశాంత్ కిషోర్ రాబోయే రోజుల్లో మరిన్ని కుట్రలు పన్నబోతున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు.డబ్బుతో ఓట్లు కొనేయవచ్చన్న ధీమాతో పాలనను గాలికి వదిలేశారన్నారు.
డబ్బున్న వాళ్లకే టికెట్లు ఇస్తే ఇలాగే పాలనను గాలికి వదిలేస్తారని వ్యాఖ్యానించారు.తెలుగుదేశం పార్టీ వాళ్లైనా వచ్చే ఎన్నికల్లో డబ్బున్న వాళ్లకు టికెట్లు ఇవ్వకపోతేనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని శివాజీ చెప్పుకొచ్చారు.