పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సామ్రాట్ భార్య.. క్యూట్ గా ఉందంటూ?

ప్రముఖ నటుడు సామ్రాట్ గురించి ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.తక్కువ సినిమాల్లోనే నటించినా ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటించడం ద్వారా సామ్రాట్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు.

 Actor Samrat Blessed With Baby Girl Details Here Goes Viral Details, Samrat, Act-TeluguStop.com

అయితే ఈ పాపులర్ నటుడు తాజాగా తండ్రిగా ప్రమోషన్ పొందారు. బిగ్ బాస్ సీజన్2 ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరైన సామ్రాట్ తాను తండ్రి అయిన విషయాన్ని ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఫ్యాన్స్ తో పంచుకున్నారు.

సామ్రాట్ మొదట హర్షిత అనే యువతిని పెళ్లి చేసుకున్నారు.అయితే పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య విబేధాలు తలెత్తాయి.మనస్పర్ధలు ఎక్కువ కావడంతో సామ్రాట్, హర్షిత విడిపోయారు.ఆ తర్వాత సామ్రాట్ శ్రీ లిఖిత అనే యువతిని పెళ్లి చేసుకున్నారు.

సామ్రాట్ భార్య లిఖిత నిన్న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.సామ్రాట్ సోషల్ మీడియా వేదికగా కూతురు ఫోటోను షేర్ చేస్తూ స్వాతంత్ర దినోత్సవంను ఈ విధంగా జరుపుకోవడం డిఫరెంట్ ఫీలింగ్ అని చెప్పుకొచ్చారు.

సామ్రాట్ షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఈ ఫోటోకు 22 వేలకు పైగా లైక్స్ వచ్చాయి.సామ్రాట్ కూతురు క్యూట్ గా ఉందంటూ పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

Telugu Samrat, Characterartist, Samrat Baby, Samrat Career, Tollywood-Movie

సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు సామ్రాట్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.కూతురును చూసి సామ్రాట్ తెగ మురిసిపోతున్నారు.

సామ్రాట్ కెరీర్ విషయంలో మరింత సక్సెస్ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు.ప్రస్తుతం సామ్రాట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను కొనసాగిస్తుండటం గమనార్హం.సామ్రాట్ తండ్రి కావడంతో అతని కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.సరైన పాత్రలు పడితే సామ్రాట్ రేంజ్ మరింత పెరగడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

సామ్రాట్ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube