నువ్వే కావాలి సినిమా ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న నటులలో సాయికిరణ్ ఒకరు.తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన నువ్వే కావాలి సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఆ తర్వాత సాయికిరణ్ పలు సినిమాలలో నటించినా ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదు.ప్రస్తుతం సాయికిరణ్ పలు సినిమాలలో నటిస్తూ నటుడిగా బిజీగా ఉన్నారు.
అయితే తాజాగా ఈ నటుడు పోలీసులను ఆశ్రయించారు.10.6 లక్షల రూపాయలు తాను మోసపోయానని ఆయన చెప్పుకొచ్చారు.మన్న మినిస్ట్రీస్ లో సభ్యత్వం పేరు చెప్పి ఈ మొత్తాన్ని నా నుంచి వసూలు చేశారని ఆయన అన్నారు.
లివింగ్ స్టెన్‌లపూ, జాన్ బాబు అనే వ్యక్తులపై సాయికిరణ్ ఫిర్యాదు చేయడం గమనార్హం.పోలీసులు కేసు 406, 420 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ తర్వాత చర్యలు చేపడతామని చెప్పుకొచ్చారు.
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఈ ఫిర్యాదు నమోదు కావడం గమనార్హం.టాలీవుడ్ ఇండస్ట్రీలో నేపథ్య గాయకునిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న రామకృష్ణ కుమారుడు సాయి కిరణ్ కావడం గమనార్హం.

సాయి కిరణ్ కు పోలీసులు న్యాయం చేయాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.ప్రస్తుతం సాయి కిరణ్ గుప్పెడంత మనస్సు సీరియల్ లో నటిస్తున్నారు.
తెలుగుతో పాటు మలయాళంలో కూడా సాయికిరణ్ సీరియల్స్ చేస్తుండగా ఈ సీరియల్స్ ద్వారా ఆయనకు మంచి పేరు వస్తుండటం గమనార్హం.చాలామంది సినీ సెలబ్రిటీలు ఇతరులను నమ్మి డబ్బులు ఇస్తూ వాళ్ల చేతిలో మోసపోతున్న ఘటనలు ఉన్నాయి.
నటుడు సాయికిరణ్ కు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది.సాయికిరణ్ కెరీర్ పరంగా మరింత సక్సెస్ కావాలని ఆయన ఫ్యాన్స్ భావిస్తున్నారు.







