జయం సినిమా( Jayam Movie ) ద్వారా హీరోగా వెండితెరకు పరిచయమయ్యారు నటుడు నితిన్( Nithin ) .
తేజ డైరెక్షన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా అప్పట్లో ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.
ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో నితిన్ ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలను అందుకున్నారు.అయితే ఈయన సక్సెస్ సినిమాలతో పాటు ఫ్లాప్ సినిమాలను కూడా ఎదుర్కొన్నారని చెప్పాలి.
ఇలా హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పట్ల నితిన్ బిజీగా ఉన్నారు.
ఇలా సినీ కెరియర్ పక్కన పెట్టి ఈయన వ్యక్తిగత విషయానికి వస్తే ఈయన 2020వ సంవత్సరంలో శాలిని( Shalini ) అనే అమ్మాయిని ప్రేమించి పెద్దల సమక్షంలో ఘనంగా వివాహం చేసుకున్నారు.ఇక ఈమె త్వరలోనే తల్లి కాబోతోందనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే శాలిని తల్లి కాబోతున్నారంటూ ఇప్పటివరకు నితిన్ ఎక్కడ కూడా అధికారకంగా వెల్లడించలేదు కానీ ఈమె త్వరలోనే బిడ్డకు జన్మనివ్వబోతున్నారని సమాచారం.
ఇలా త్వరలోనే నితిన్ తండ్రి కాబోతున్న నేపథ్యంలో ఈయన సినిమాలకు కొన్ని నెలల పాటు బ్రేక్ ఇవ్వబోతున్నారని సమాచారం.
శాలిని ప్రస్తుతం కడుపు( Pregnant ) తో ఉందని ఆమెకు సెప్టెంబర్ లో డెలివరీ డేట్ ఇవ్వటం వల్ల నితిన్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని సమాచారం.ఇలాంటి సమయంలో తన అవసరం తన భార్యకు, బిడ్డకు ఎంతో ముఖ్యమని భావించిన ఈయన కొద్ది నెలలపాటు సినిమా షూటింగులకు విరామం ప్రకటించి ఆ విలువైన సమయాన్ని తన భార్యతో గడపాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.మరి నితిన్ గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో లేదో తెలియదు కానీ అభిమానులు మాత్రం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇక నితిన్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన రాబిన్ హుడ్, తమ్ముడు వంటి సినిమాలలో నటిస్తున్నారు.ఇక రాబిన్ హుడ్ ( Robin hood ) డిసెంబర్ 20వ తేదీ విడుదలకు సిద్ధంగా ఉంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy