మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (‘మా’) ఎన్నికలు అక్టోబర్ 10న నిర్వహించినట్లు ప్రస్తుత అధ్యక్షుడు వి.కె నరేష్ ప్రకటించారు.
ఇటీవలే ‘మా’ సర్వసభ్య సమావేశాల్లో ఎన్నికల విషయంలో క్రమశిక్షణ సంఘం DRC ఎలా చెబితే అలా చేస్తానని ఆయన తెలిపారు.వారంలో ఎన్నికల తేదీ ప్రకటిస్తామని DRC చైర్మన్ కృష్ణంరాజు అప్పుడు చెప్పారు.
తాజాగా వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని సెప్టెంబర్ 12, అక్టోబర్10 నెలలో రెండో ఆదివారం నిర్వహిస్తే సభ్యులందరికీ ఓటు వేయడానికి వీలవుతుందని ఆయన లేఖలో రాశారు.
.
తుది నిర్ణయం అధ్యక్షుడికి వదిలేశారు.ఇతర తేదీల్లో పెడితే ఎన్నికలకు హాజరవడానికి కష్టమవుతుంది.
వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని అక్టోబర్ 10న ఎన్నికలు నిర్వహించేందుకు నేను సుముఖంగా ఉన్నానని నరేష్ అన్నారు నిబంధన ప్రకారం అధ్యక్ష హోదాలో అక్టోబర్ 10 నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.అందరిలో ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తున్న అధ్యక్షులు ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, CVL నరసింహరావు, జీవిత రాజశేఖర్, హేమా ఉన్నారు.
చివరి నిమిషాల్లో ఎవరైనా బరిలోకి దిగుతారా లేక ఎవరైనా ఏకగ్రీవం చేస్తారా అన్నది ఉత్కంఠగా మారింది.మరోవైపు నటీనటుల్లో సమస్యల పరిష్కారంతో పాటు.
మా నూతన భవనం నిర్మాణం ప్రధాన అజెండాగా ఈసారి ఎన్నికలు జరుగనున్నాయి.