హీరో రాజ్ తరుణ్ సూసైడ్ చేసుకుంటానని చెప్పాడా.. షాకింగ్ విషయాలు రివీల్!

ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మావ, కుమారి 21ఎఫ్ సినిమాల విజయాలతో వార్తల్లో నిలిచిన రాజ్ తరుణ్ ఈ సినిమాల సక్సెస్ తో తన మార్కెట్ ను పెంచుకున్నారు.అయితే ఆ తర్వాత రాజ్ తరుణ్ పలు సినిమాలలో నటించినా ఏ సినిమా కూడా సక్సెస్ సాధించలేదు.

 Actor Madhunandan Comments About Raj Tharun Suicide Details, Madhunandan, Raj Th-TeluguStop.com

అనుభవించు రాజా సినిమాతో మరోసారి తన లక్ ను పరీక్షించుకున్న రాజ్ తరుణ్ కు ఈ సినిమాతో చేదు ఫలితం ఎదురైంది.

ప్రముఖ టాలీవుడ్ నటులలో ఒకరైన మధునందన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇండస్ట్రీలో ఆఫర్ల కోసం రకరకాలుగా ప్రయత్నాలు చేసేవాళ్లు ఉంటారని ఆయన అన్నారు.

లాక్ డౌన్ సమయంలో ఫోన్లలో మాట్లాడుకోవడం తప్ప మరేం లేదని రాజ్ తరుణ్ కాల్ చేసి ఇంకో వన్ వీక్ లాక్ డౌన్ ను కొనసాగిస్తే సూసైడ్ చేసుకుంటానని తన పరిస్థితి అలా ఉందని ఒక్కడినే ఉన్నానని పిచ్చి పడుతోందని కామెడీగా చెప్పాడని మధునందన్ అన్నారు.

నా వల్ల కావడం లేదని ఏం చేయాలో నాకు తెలియడం లేదని రాజ్ తరుణ్ చెప్పాడని మధునందన్ కామెంట్లు చేశారు.

Telugu Corona Lockdown, Raj Tharun, Madhunandan, Raj Tarun, Thoughts, Tollywood,

నువ్వైనా మా ఇంటికి రా లేకపోతే నన్ను అయినా మీ ఇంటికి తీసుకొని వెళ్లు అని రాజ్ తరుణ్ తనతో చెప్పాడని మధునందన్ చెప్పుకొచ్చారు.రాజ్ తరుణ్ అలా ఫోన్ చేయడంతో మా ఫ్రెండ్ సహాయంతో రాజ్ తరుణ్ అడ్రస్ ఇచ్చి రాజ్ తరుణ్ ను తన ఇంటికి పిలిపించుకున్నానని మధునందన్ పేర్కొన్నారు.

Telugu Corona Lockdown, Raj Tharun, Madhunandan, Raj Tarun, Thoughts, Tollywood,

రాజ్ తరుణ్ మూడువారాల పాటు మా ఇంట్లో ఉన్నాడని రాజ్ తరుణ్ ఇంటికి వచ్చిన తర్వాత తన సొంతింటికి వెళ్లనని చెప్పాడని మా ఇంటి దగ్గర ఉన్న పిల్లలతో ఆడుకుంటానని ఆన్నాడని మధునందన్ కామెంట్లు చేశారు.గోవా నుంచి వాళ్ల ఫ్యామిలీ వచ్చిన తర్వాత రాజ్ తరుణ్ ఇంటికి వెళ్లాడని మధునందన్ వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube