నేడు ఏపీకి బీజేపీ బాస్ ! పవన్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారా ?

ఏపీలో ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకుంటారో తెలియదు గాని ప్రస్తుతం ఈ వ్యవహారమే హాట్ టాపిక్ గా మారింది.ఇదిలా ఉండగానే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సోమ, మంగళ వారాల్లో ఆంధ్రప్రదేశ్ లో ఆయన పర్యటిస్తారు.

 Bjp National President Jp Nadda Tor In Ap, Bjp, Jp Nadda, Ap Bjp, Janasenani,bjp-TeluguStop.com

భారత ప్రధానిగా నరేంద్రమోధీ బాధ్యతలు స్వీకరించి ఎనిమిదేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా బిజెపి అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది.పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు, నిత్యం జనాల్లో ఉండే విధంగా పార్టీ తరఫున వివిధ కార్యక్రమాలను చేపడుతున్నారు.

దీనిలో భాగంగానే జేపీ నడ్డా ఏపీలో రెండు రోజుల పర్యటన ను పెట్టుకున్నారు.రాష్ట్రంలోని పోలింగ్ కేంద్రాలను బీజేపీ శక్తి కేంద్రాలు గా మార్చింది.

వాటికి ఇన్చార్జిల నియామకం చేపట్టారు.

ఇప్పుడు ఆ శక్తి కేంద్రాల ఇన్చార్జిల తో నేడు భేటీ కాబోతున్నారు.

అలాగే విజయవాడలో ఈరోజు సాయంత్రం 5 గంటలకు విజయవాడ నగర , ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ప్రముఖులతో ను ఆయన సమావేశం కాబోతున్నారు.ఇక రాత్రికి విజయవాడ లోనే బస చేసి మంగళవారం ఉదయం కనకదుర్గమ్మను దర్శించుకుని, కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల తో సమావేశమై రేపు సాయంత్రానికి ఢిల్లీకి వెళ్లనున్నారు.

రెండు రోజుల పర్యటనలో జనసేన వ్యవహారం పైన ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది.ప్రస్తుతం టీడీపీతో పొత్తు కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంకేతాలు ఇస్తున్నారు.

బిజెపి ఈ విషయాన్ని వ్యతిరేకిస్తూ ఉండటం తో పవన్ బీజేపీ ని వదిలి పెటైనా టిడిపికి దగ్గరవ్వాలని చూస్తున్నారు.

Telugu Ap Bjp, Bjp National, Cmcandi, Janasenani, Jp Nadda, Pothina Mhahesh, Som

దీంతో బిజెపి జనసేన పార్టీల ఉమ్మడి సీఎం అభ్యర్థిగా పవన్ పేరును ప్రకటిస్తారని అంతా అభిప్రాయపడుతున్నారు.ఇప్పటికే జనసేన పార్టీ కీలక నేత పోతిన మహేష్ ఈ వ్యవహారం పై స్పందించారు.బిజెపి జనసేన పార్టీల ఉమ్మడి సీఎం అభ్యర్థిగా పవన్ పేరును బిజెపి ప్రకటించాలని, అప్పుడే పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెరుగుతుందని ఆయన సూచిస్తున్నారు.

అంతేకాదు ఏపీ ప్రభుత్వం పైన విమర్శలు చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు .అయితే పవన్ విషయంలో సానుకూలంగా ఉన్న బీజేపీ అగ్రనేతలు ఇప్పుడు జేపీ నడ్డా ద్వారా పవన్ సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారా అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube