బన్నీ, ఎస్వీ కృష్ణారెడ్డి ఇంట్లో కూలివాడిగా పని చేశా.. ప్రముఖ నటుడి షాకింగ్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా లక్ష్మణ్ మీసాల( Laxman Meesala ) ఊహించని స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

మంగళవారం సినిమాతో( Mangalavaaram Movie ) లక్ష్మణ్ మీసాల మంచి పేరును సంపాదించుకున్నారు.

తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన లక్ష్మణ్ మీసాల కో అంటే కోటి సినిమతో నటుడిగా కెరీర్ ను మొదలుపెట్టారు.లక్ష్మణ్ మీసాల ఇప్పటివరకు 25 కంటే ఎక్కువ సినిమాలు చేశారు.

పదో తరగతికే చదువు ఆపేశానని సినిమాల్లోకి రాకముందు ఎన్నో పనులు చేశానని ఏ పని చేసినా అందులో తృప్తి దొరకలేదని అందుకని కొన్నాళ్లకు ఆ పని మానేసి మరొకటి చేసుకుంటూ పోయానని కానీ సినిమాలంటే ఇష్టం ఉండటంతో ఇక్కడ ఆగిపోయానని లక్ష్మణ్ మీసాల అన్నారు నేను నటుడిగానే కొనసాగుతున్నానని ఆయన కామెంట్లు చేశారు.ఇండస్ట్రీకి రావడానికి ముందు కూలి పని కూడా చేశానని లక్ష్మణ్ వెల్లడించారు.

నాకు తెలియకుండానే బన్నీ, ( Bunny ) ఎస్వీ కృష్ణారెడ్డికి( SV Krishna Reddy ) ఇంటికి కూలి పని చేశానని లక్ష్మణ్ అన్నారు.నేను ఇల్లు కట్టిన తర్వాత ఆ ఇల్లు బన్నీ ఇల్లని తెలిసిందని లక్ష్మణ్ కామెంట్లు చేశారు.కూలి పని చేసే సమయంలో చాలా దెబ్బలు తగులుతాయని అలా అక్కడ కూడా పెద్ద దెబ్బ తగిలి రక్తం కారిందని ఆయన వెల్లడించారు.

Advertisement

ఫిల్మ్ నగర్ కల్చరల్ భవన నిర్మాణానికి సైతం పని చేశానని ఆయన అన్నారు.

ఎవరెవరి ఇంటికో తెలియకుండా పని చేశానని లక్ష్మణ్ మీసాల వెల్లడించారు.కొన్నిసార్లు ఎవరి ఇంటికి పని చేశానో కూడా తెలియని సందర్భాలు ఉన్నాయని ఆయన అన్నారు.లక్ష్మణ్ మీసాల చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

లక్ష్మణ్ మీసాల తర్వాత ప్రాజెక్ట్ లతో మరింత సక్సెస్ సాధిస్తారేమో చూడాలి.లక్ష్మణ్ ను అభిమానించే వాళ్ల సంఖ్య పెరుగుతోంది.

ఏకంగా హీరోనే డామినేట్ చేసిన టాలెంటెడ్ యాక్టర్స్.. ఎవరంటే..? 
Advertisement

తాజా వార్తలు