నటుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజు అంతిమ యాత్ర ప్రారంభమైంది.జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసం నుంచి మొయినాబాద్ మండలం కనకమామిడిలోని ఫామ్ హౌస్ కు అంత్యక్రియలు జరగనున్నాయి.
ప్రభాస్ సోదరుడు ప్రభోద్ చేతుల మీదుగా దహన సంస్కారాల కార్యక్రమం నిర్వహించనున్నారు.
అయితే, అంత్యక్రియలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.
ఈ నేపథ్యంలో కృష్ణంరాజు కడసారి చూపుకోసం భారీగా అభిమానులు తరలి వస్తున్నారు.ఈ క్రమంలో ఎటువంటి తొక్కిసలాట జరగకుండా ముందు జాగ్రత్తగా అంత్యక్రియలకు కేవలం కుటుంబ సభ్యులకు, బంధువులకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు.







