అవకాశం వస్తే ది కేరళ స్టోరీ సినిమాని బ్యాన్ చేస్తారా... కమల్ సమాధానం ఇదే!

డైరెక్టర్ సుదీప్తో సేన్ ( Sudipto Sen ) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ది కేరళ స్టోరీ( Di Kerala Story ) .ఆదాశర్మ( Adah Sharma ) ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా దేశవ్యాప్తంగా సంచలనమైన విజయాన్ని అందుకుంది.

 Actor Kamal Haasan Comments About Ban Calls On The Kerala Story Know What He Sai-TeluguStop.com

కేవలం 20 రోజులలోనే సుమారు 200 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించి చరిత్ర సృష్టించింది.ఇలా ఈ సినిమా విడుదలైన తర్వాత ఇంత మంచి సక్సెస్ అందుకున్నప్పటికీ ఈ సినిమా విడుదలకు ముందు నుంచి కూడా వివాదాలలో చిక్కుకుంది.

ముఖ్యంగా ఈ సినిమాని బ్యాన్ చేయాలి అంటూ నిరసనలు వెల్లువెత్తాయి.అలాగే ఈ సినిమా చూసినటువంటి ఎంతోమంది సెలబ్రిటీలు సినిమాపై విమర్శలు కూడా చేశారు.

Telugu Adah Sharma, Di Kerala Story, Kamal Hassan, Sudipto Sen-Movie

ఈ సినిమా టైటిల్ కింద నిజ సంఘటనల ఆధారంగా అనే టాగ్ లైన్ ఉండడంతో ఈ ట్యాగ్ లైన్ పై కమల్ హాసన్ ( Kamal Hassan ) స్పందించారు.ఇలా టాగ్ లైన్ ఉంటే సరిపోదని అది నిజంగా జరిగి ఉంటేనే ఆ టైటిల్ కు అర్థం ఉంటుందని కమల్ హాసన్ కూడా ఈ సినిమాపై స్పందించిన విషయం మనకు తెలిసిందే.ఇకపోతే చాలామంది ఈ సినిమాని బ్యాన్( Ban ) చేయాలని డిమాండ్ చేస్తున్నారు.ఈ క్రమంలోని తాజాగా జరిగిన ఇండియా టూడే కాంక్లేవ్ సౌత్ 2023లో పాల్గొన్న ఆయన.ది కేరళ స్టోరీ సినిమా బ్యాన్ చేయడం గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.ఈ సినిమాని బ్యాన్ చేయాలని డిమాండ్ వెళ్ళుతున్న సమయంలో మీ అభిప్రాయం ఏంటి అనే ప్రశ్న ఈయనకు ఎదురయింది.

Telugu Adah Sharma, Di Kerala Story, Kamal Hassan, Sudipto Sen-Movie

ఈ ప్రశ్నకు కమల్ హాసన్ స్పందిస్తూ తన అభిప్రాయాన్ని తెలియజేశారు.నేను ఆ సినిమా చూడలేదు.కానీ ప్రజలు ఏమి మాట్లాడుతున్నారో విన్నాను.నాకు తెలిసినంతవరకు ఆ చిత్రంలోని కొన్ని విషయాలు జరిగి ఉండవచ్చు.ఇక సినిమా బ్యాన్ చేసే విషయం గురించి మాట్లాడాల్సి వస్తే నేను ఏ సినిమాని బ్యాన్ చేయాలని కోరుకోనని తెలిపారు.వారిని మాట్లాడనివ్వండి.

సినిమా ఉద్దేశ్యం ఏంటో ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇక తమిళనాడులో కూడా విశ్వరూపం సినిమాని బ్యాన్ చేశారు .అయితే ఈ సినిమా చూసినవారు అసలు ఈ సినిమాని ఎందుకు బ్యాన్ చేశారని ఇప్పటికీ ఆశ్చర్యపోతూ ఉంటానని ఈ సందర్భంగా కమల్ హాసన్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube