నటి రోజా అలాంటి వ్యక్తి.. వైరల్ అవుతున్న బండ్ల గణేష్ షాకింగ్ కామెంట్స్!

ప్రముఖ టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రోజా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.ఆంధ్ర గురించి ఎదురైన ప్రశ్నలకు బండ్ల గణేష్ స్పందిస్తూ ఆంధ్ర గురించి ఎవరికి తెలుసు అని అన్నారు.

 Actor Bandla Ganesh Shocking Comments About Roja Details Here Goes Viral ,actor-TeluguStop.com

అది పెద్ద రోత రాజకీయం అని మనకెందుకు అని బండ్ల గణేష్ కామెంట్లు చేశారు.విజయసాయిరెడ్డి గారి కామెంట్లపై మాత్రమే నేను స్పందించానని బండ్ల గణేష్ తెలిపారు.

విజయసాయిరెడ్డిపై రియాక్ట్ కావడంతో నీకెందుకు రాజకీయాలు అని బొత్స సత్యనారాయణ కాల్ చేసి తిట్టారని బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు.బొత్స సత్యనారాయణ అంటే నాకు చాలా అభిమానమని ఆయన తెలిపారు.

వైవీ సుబ్బారెడ్డి ఆయన భార్యను చూస్తే పార్వతీ పరమేశ్వరులను చూసినట్టు ఉంటుందని బండ్ల గణేష్ కామెంట్లు చేశారు.కేటీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో మాతో చాలా బాగుండేవారని ఆయన అన్నారు.

చంద్రబాబు, వైఎస్సార్ హైదరాబాద్ ను అభివృద్ధి చేశారని కేటీఆర్ ఇంకో స్థాయికి తీసుకెళ్లారని బండ్ల గణేష్ పేర్కొన్నారు.రాజకీయాలకు అతీతంగా ఈ కామెంట్లు చేస్తున్నానని ఆయన కామెంట్లు చేశారు.ఇతర రాష్ట్రాల రాజకీయాల గురించి నన్ను అడగవద్దని బండ్ల గణేష్ పేర్కొన్నారు.మనిషిని తిట్టవచ్చని కులాన్ని తిట్టవద్దని నేను కోరుకుంటానని బండ్ల గణేష్ పేర్కొన్నారు.

మన మంచితనం మన చెడ్డతనం అదే రేంజ్ లో ఉండాలని ఆయన అన్నారు.రోజాగారు నాపై ఎలాంటి కేసు పెట్టలేదని ఆయన అన్నారు.ఊరికే అన్నారు కానీ ఏం చేయలేదని బండ్ల గణేష్ తెలిపారు.రోజాగారు హీరోయిన్ గా నటించి, రాజకీయాల్లో కూడా సక్సెస్ సాధించారని ఆమె విషయంలో గర్వపడాలని ఆయన పేర్కొన్నారు.

రోజా నా సోదరి అని బండ్ల గణేష్ కామెంట్లు చేయడం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube