ఏం చెయ్యాలో తెలియక ఏటీఎం రూమ్ లో నిద్రపోయానన్న నటుడు.. ఎవరంటే?

సినీ ఇండస్ట్రీలో పైకి నవ్వుతూ నటించే హీరో హీరోయిన్లు, నటీనటుల జీవితంలో ఎన్నో విషాదాలు ఉంటాయి.అయితే వారికి తెర వెనుక ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ తెరపై మాత్రం నవ్వుతూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు.

 Actor Ankit Siwach Recalling His Struggling Days Details, Tv Actor, Serial Actor, Bollywood, Struggling, Ankit Siwach Struggling Day, Serial Actor Ankit Siwach, Slept At Atm, Bollywood Serial Actor-TeluguStop.com

కాని చాలామంది సినీ ఇండస్ట్రీ లో ఉండే సెలబ్రిటీలకు ఎటువంటి కష్టాలు ఉండవు అని అనుకుంటూ ఉంటారు.కానీ ఇలా అనుకుంటే భ్రమపడినట్టే.

ఎందుకంటె పైకి నవ్వుతూ కనిపించే ఆ నవ్వుల వెనుక ఎన్నోబాధలు కష్టాలు ఉంటాయి.అలా వారి బాధలు బయటకు కనిపించకుండా నవ్వుతూ నవ్విస్తూ ఉన్న వారు ఎంతోమంది ఉన్నారు.

 Actor Ankit Siwach Recalling His Struggling Days Details, TV Actor, Serial Actor, Bollywood, Struggling, Ankit Siwach Struggling Day, Serial Actor Ankit Siwach, Slept At Atm, Bollywood Serial Actor-ఏం చెయ్యాలో తెలియక ఏటీఎం రూమ్ లో నిద్రపోయానన్న నటుడు.. ఎవరంటే-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అలాంటి వారిలో బుల్లితెర నటుడు అంకిత్‌ సివాచ్‌ కూడా ఒకరు.

అంకిత్ సివాచ్ కూడా కెరిర్ మొదట్లో మోడలింగ్‌ సమయంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నానని తెలిపాడు.

ఈ సందర్భంగా అంకిత్‌ సివాచ్‌ మాట్లాడుతూ.అంకిత్‌ సివాచ్‌ ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో జన్మించాడు.

ఢిల్లీలో ఉంటు ఒకవైపు చదువుకుంటూనే కాల్‌ సెంటర్‌లో పనిచేసేవాడిని అని తెలిపాడు అంకిత్‌ సివాచ్‌.ఇక మోడలింగ్ పూర్తి చేయడానికి 60 వేలు అవసరమయ్యాయని,కానీ అందుకోసం అతని తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టలేదట.

ఎందుకంటే కేవలం అతని ఇష్టంతోనే మోడలింగ్‌ను ఎంచుకున్నాడట.ఇక అతను సంపాదించిన డబ్బులతోనే మోడలింగ్‌ పూర్తి చేయాలనుకున్నాడట.

అయితే అప్పడు వేసవి కాలం కావడంతో ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయట ఇక అప్పుడు ఆ సమయంలో ఎండకు తాళలేక అంకిత్‌ సివాచ్‌ ఏటీఎమ్‌ దగ్గర పనిచేసే వాచ్‌మెన్‌కు ఓ వంద రూపాయలు ఇచ్చి అక్కడ పడుకునేవాడట.ఎందుకంటే అందులో ఏసీ ఉంటుంది కదా అందుకోసమే అక్కడే ఉండే వాడిని అని చెప్పుకొచ్చాడు అంకిత్‌ సివాచ్‌.

Telugu Bollywood, Serial, Serialankit, Slept Atm, Tv-Latest News - Telugu

అలా దాదాపు ఏడు వారాలపాటు ఏసీ కోసం ఏటీఎమ్‌లో నిద్రించేవాడిని అని చెప్పుకొచ్చాడు అంకిత్‌ సివాచ్‌.ఒకవేళ అతనికి డబ్బు కావాలని అతని పేరెంట్స్‌ను అడిగితే వాళ్లు ఒక్క మాట కూడా తిరిగి ప్రశ్నించకుండా అతనికి అడిగినంత డబ్బును పంపించేవారట.కానీ అతనికి అది ఇష్టం లేదట.పైగా డబ్బులు కూడా దుబారా ఖర్చు పెట్టకూడదని ఫ్రెండ్స్‌తో పార్టీలకు,పబ్బులకి వెళ్లేవాడుకాదట.దీనితో అతన్ని చాలా మంది ద్వేషించేవారట.ఇంట్లో ఉంటే హాయిగా ఉండే అతను అక్కడికి వెళ్లిన తరవాత,చాలా కష్టాలు పడ్డాడట.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube