నిన్నటి తరం హీరోలలో ఒకరైన ఆకాశ్ నటించింది తక్కువ సినిమాలే అయినా తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్ట్కున్నారు.ఆనందం సినిమాతో ఓవర్ నైట్ లో పాపులర్ అయిన ఆకాశ్ ఆ తర్వాత తెలుగులో పలు సినిమాలలో హీరోగా నటించినా ఆశించిన సక్సెస్ లను అయితే సొంతం చేసుకోలేకపోయారనే సంగతి తెలిసిందే.
అయితే ఆనందం హీరో ఆకాశ్ సీరియళ్లలోకి ఎంట్రీ ఇవ్వడం హాట్ టాపిక్ అవుతోంది.
సినిమాలలో ఆఫర్లు తగ్గడం వల్లే ఆకాశ్ సీరియళ్లలోకి ఎంట్రీ ఇచ్చారని సమాచారం అందుతోంది.
ఆకాశ్ సీరియళ్లలో ఏ స్థాయిలో సక్సెస్ అవుతారో చూడాల్సి ఉంది.జెమిని టీవీలో ఆకాశ్ కొత్త సీరియల్ షూట్ ప్రసారం కానుందని సమాచారం అందుతోంది.
గతంలో కొన్ని తమిళ సీరియళ్లలో నటించిన ఆకాశ్ తెలుగు సీరియళ్లతో ఏ స్థాయిలో సక్సెస్ అవుతారో చూడాల్సి ఉంది.

వాస్తవానికి ఆకాశ్ తలచుకుంటే ఇప్పటికీ తెలుగు సినిమాలలో ఆయనకు మంచి ఆఫర్లు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.ఆకాశ్ ప్రస్తుతం పరిమితంగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది.ఆకాశ్ సీరియళ్లలో నటించడం విషయంలో ఫ్యాన్స్ అయితే హ్యాపీగా లేరు.
ఆకాశ్ సినిమాలకే పరిమితమై ఉంటే బాగుండేదని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

ఆకాశ్ సీరియళ్లలో సక్సెస్ అయితే ఆయనకు ఇతర ఛానెళ్ల నుంచి ఆఫర్లు వచ్చే అవకాశం అయితే ఉంది.ఆకాశ్ తెలుగు సీరియళ్లకే పరిమితమవుతారో లేక ఇతర భాషల్లోని సీరియళ్లతో కూడా బిజీ అవుతారో చూడాల్సి ఉంది.నటుడిగా ఆకాశ్ రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది.
సోషల్ మీడియాలో కూడా ఆకాశ్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఊహించని స్థాయిలో పెరుగుతోందని తెలుస్తోంది.ఆకాశ్ ఫ్యామిలీకి ఇతర దేశాలలో కూడా వ్యాపారాలు ఉన్నాయని సమాచారం అందుతోంది.
నటనపై ఆసక్తి ఉండటంతో ఆకాశ్ నటుడిగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.








