సపోటా సాగులో చెక్క తెగుల నివారణకు చర్యలు..!

సపోటా( Sapota ) పంట సాగులో అధిక దిగుబడిను తక్కువ ఖర్చుతో పొందాలంటే కొద్ది పాటి మెలకువలు పాటిస్తే చాలు.ఈ సపోటా తోటలు సంవత్సరంలో రెండుసార్లు కాపుకొస్తాయి.

 Actions To Prevent Wood Rot In Sapota Cultivation , Sapota Cultivation, Prevent-TeluguStop.com

ఇక మేలురకం సపోటా విత్తనాలను ఎంచుకొని సాగు చేయాలి.ఒక ఎకరంలో దాదాపుగా 40 దాకా సపోటా మొక్కలు నాటుకోవచ్చు.

కేవలం ఒక్కసారి నాటితే 50 నుండి 60 సంవత్సరాల పాటు దిగుబడి వస్తూనే ఉంటుంది.అయితే నీటి సౌకర్యం ఉండి, నీరు నిల్వ ఉండని తేలికపాటి నేలలు సపోటా పంట సాగుకు చాలా అనుకూలంగా ఉంటాయి.

ఇక సపోటా పంటకు చీడపీడల బెడద, తెగుళ్ల బెడద( Pests ) కాస్త ఎక్కువ.సకాలంలో గుర్తించి సంరక్షక చర్యలు చేపడితే అధిక దిగుబడి పొందవచ్చు.

Telugu Agriculture, Copper, Sulphate, Latest Telugu, Wood Rot, Sapota-Latest New

సపోటా పంటకు తీవ్ర నష్టం కలిగించే తెగులలో చెక్క తెగులు( Wood rot ) కీలక పాత్ర పోషిస్తుంది.ఈ చెక్క తెగులు సోకితే సగానికి పైగా దిగుబడి తగ్గే అవకాశం ఉంది.ఈ చెక్క తెగులు సోకితే కొమ్మలు వంకర్లు తిరగడం, ఆకులు రాలిపోవడం, చివరికి కాండంతో సహా కొమ్మలు ఎండిపోవడం జరుగుతుంది.ఈ తెగులు సోకిన కొమ్మలను వెంటనే కత్తిరించాలి.

ఆ తరువాత ఒక లీటర్ నీటిలో మూడు గ్రాముల కాపర్ ఆక్సి క్లోరైడ్( Copper oxychloride ) కలిపి కొమ్మలు, ఆకులు పూర్తిగా తడిచేటట్లు పిచికారి చేయాలి.లేదంటే 2.5 గ్రాముల మాంకోజెబ్ ను లీటరు నీటిలో కలిపి పిచికారి చేసి ఈ చెక్క తెగులను నివారించాలి.

Telugu Agriculture, Copper, Sulphate, Latest Telugu, Wood Rot, Sapota-Latest New

మొక్కలలో ఇనుప ధాతువు లోపం ఉన్నట్లయితే ఫెర్రస్ సల్ఫేట్ 2గ్రా, నిమ్మ ఉప్పు 1గ్రా ను లీటరు నీటిలో కలిపి పిచికారి చేసి ఈ ఇనుప ధాతువు లోపాన్ని లేకుండా చూడాలి.ఇక సపోటా మొక్కల మొదల వద్ద ఎప్పటికప్పుడు కలుపు నివారణ చర్యలు చేపడుతూ ఉండాలి.నీటిని పారించకుండా డ్రిప్ విధానం ద్వారా పంటకు నీరు అందించాలి.

ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఏడాదికి రెండుసార్లు మంచి దిగుబడి పొందవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube