ఉద్యానవన పంటలలో అరటి పంట( Banana crop ) కూడా ఒకటి.అరటి పంటను ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్యకాలంలో ఎక్కువగా నాటుతారు.
అరటి పంటకు తెగుళ్ల, చీడపీడల బెడద కాస్త ఎక్కువ.సకాలంలో వీటిని గుర్తించి తొలి దశలోనే అరికట్టకపోతే రైతులు తీవ్ర నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

అరటి పంటకు తీవ్ర నష్టం కలిగించే తెగుళ్ల విషయానికి వస్తే.బ్యాక్టీరియా దుంప కుళ్ళు తెగులు కీలకపాత్ర పోషిస్తాయి.ఉష్ణోగ్రత అధికంగా ఉంటే ఈ దుంప కుళ్ళ తెగుళ్లు ఉధృతి అధికం అవుతుంది.అరటి మొక్క కాండం మొదలులో కుళ్లుమచ్చలు ఏర్పడి క్రమేపి దుంప కుళ్ళిపోతుంది.లేత మొక్కలైతే పూర్తిగా కుళ్ళిపోయి చనిపోతాయి.పెద్ద మొక్కలైతే కాండంపై నిలువుగా పగుళ్లు ఏర్పడతాయి.
దుంప పైభాగం నుంచి కుళ్ళిన వాసన వస్తుంది.ఆకులు పసుపు రంగులోకి మారి ఎండిపోయి చనిపోతాయి.
చివరికి పిలకల వరకు ఈ తెగులు సోకి దిగుబడిపై ప్రభావం చూపిస్తాయి.

వ్యవసాయ క్షేత్ర నిపుణుల సూచనల ప్రకారం.ఫిబ్రవరి నుంచి జూన్ మధ్యలో దాటిన అరటి తోటలలో ఈ బ్యాక్టీరియా దుంప కుళ్ళు తెగుళ్ల తీవ్రత అధికంగా ఉంటుంది.కాబట్టి ఆ మధ్యకాలంలో అరటి మొక్కలు నాటవద్దని నిపుణుల సూచన.
తెగులు సోకని ఆరోగ్యకరమైన అరటి పిలకలను ఎంపిక చేసుకొని నాటుకోవాలి.ఆ పిలకలను ఆక్సీక్లోరైడ్, మోనోక్రోటోఫాస్( Oxychloride monocrotophos ) మందుతో విత్తన శుద్ధి చేసుకోవాలి.
అరటి మొక్కకు ఏ తెగులు సోకిన ముందుగా ఆ మొక్కను పొలం నుంచి పీకి కాల్చి నాశనం చేయాలి.ఆ తరువాత వ్యవసాయ క్షేత్ర నిపుణుల సలహా మేరకు పిచికారి మందులను ఉపయోగించి పంటను సంరక్షించుకోవాలి.
అప్పుడే ఆశించిన స్థాయిలో మంచి దిగుబడులు పొంది మంచి లాభాలు అర్జించవచ్చు.







