విశాల్ తమిళ హీరో అయినప్పటికి తెలుగులో మంచి క్రేజ్ ఉంది.ఈయన సినిమాలు అన్ని కూడా తెలుగులో డబ్ అయ్యి మంచి విజయాన్ని సాధించాయి.
అందుకే ఈ చిత్రాన్ని కూడా తెలుగులో భారీగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.తెలుగులో విశాల్‌కు ఉన్న క్రేజ్ నేపథ్యంలో సినిమాను ఎక్కువ థియేటర్లలో విడుదల చేశారు.మరి ఈ చిత్రం ఎలా ఉంది అనేది ఈ రివ్యూలో చూద్దాం.
కథ :
పాకిస్తానీ ఉగ్రవాదులు ఇండియాలో విధ్వసం సృష్టిస్తూ ఎంతో మంది ప్రాణాలను బలిగొంటారు.పాకిస్తాన్‌కు బుద్ది చెప్పడంతో పాటు ఇండియాలో జరిగిన ఉగ్రదాడులకు ప్రతీకారం తీర్చుకునేందుకు హీరో సిద్దం అవుతాడు.భారీ యాక్షన్ సీన్స్‌తో తెరకెక్కిన ఈ చిత్రం కథ చాలా సింపుల్‌గా ఉన్నా స్క్రీన్‌ప్లేతో మ్యానేజ్ చేశారు.
నటీనటుల నటన :
విశాల్ ఎప్పటిలాగే మాస్ లుక్‌లో అలరించాడు.యాక్షన్ సీన్స్ అంటే ఖచ్చితంగా విశాల్ ప్రాణం పెట్టి మరీ పోరాడుతాడు.
అలాగే ఈ చిత్రంలో కూడా తప్పకుండా ఆకట్టుకుంటాడు అన్నట్లుగానే ఆకట్టుకున్నాడు.అయితే రొమాంటిక్ సీన్స్ విషయంలో మాత్రం నిరాశ పర్చాడు.
విశాల్ మొదటి నుండి కూడా చెబుతున్నట్లుగా ఈ చిత్రం ఫుల్ మాస్ ఎలిమెంట్స్‌తో ఉంది.ఇక తమన్నా తన అందంతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.
ఈమెకు ఎక్కువ స్కోప్ లేదు.యోగి బాబు తన కామెడీతో మెప్పించే ప్రయత్నం చేశాడు.
ఇతరులు వారి పాత్రల పరిధిలో నటించి ఓకే అనిపించారు.
టెక్నికల్ :
ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కెమెరా పనితనం.యాక్షన్ సీన్స్ బాగా రావాలి అంటే కెమెరా పనితనం బాగుండాలి.కెమెరా యాంగిల్స్‌ను బట్టి యాక్షన్ సీన్స్ సహజంగా కనిపిస్తాయి.
ఇందులో యాక్షన్ సీన్స్ చాలా సహజంగా రావడంలో సినిమాటోగ్రఫీ ఫుల్‌గా ఉపయోగపడింది.దర్శకుడు ఈ చిత్రం స్క్రీన్‌ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది.
డైలాగ్స్ మరియు దర్శకత్వంలో కూడా కొత్తదనం కనిపించలేదు.నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి.
సంగీతం సో సోగా ఉంది.బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది.
విశ్లేషణ :
యాక్షన్ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు హాలీవుడ్ రేంజ్‌లో ఉంటాయంటూ మొదటి నుండి ప్రచారం చేశారు.కాని సాహో స్థాయిలో కూడా లేవని చెప్పక తప్పదు.
ఎందుకంటే విశాల్ యాక్షన్ సీన్స్ బాగానే చేశాడు కాని అవి ఇంకాస్త కొత్తదనంతో కూడి ఉంటే బాగుండేది.తమన్నాను ఈ సినిమాలో హీరోయిన్‌గా తీసుకున్నారు.ఆమె కనిపించినప్పుడు మాత్రమే ఆమె హీరోయిన్ అనే విషయం గుర్తుకు వస్తుంది.అందుకే తమన్నాకు పెద్దగా స్కోప్ లేదు.
కామెడీతో కొంత గుంజుకు వచ్చే ప్రయత్నం చేసినా మొత్తానికి ఈ చిత్రం యాక్షన్ సీన్స్ అంటే ఇష్టపడే వారికి మాత్రమే నచ్చుతుంది.
ప్లస్ పాయింట్స్ :
కొన్ని యాక్షన్ సీన్స్, యోగిబాబు కామెడీ సీన్స్
మైనస్ పాయింట్స్ :
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంఎంటర్టైన్మెంట్ తక్కువ అవ్వడంయాక్షన్ ఎక్కువ అయ్యింది.
బోటమ్ లైన్ :
శృతిమించిన యాక్షన్.బాబోయ్ అందరికి దీన్ని భరించడం సాధ్యం కాదు.