టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి మనందరికీ తెలిసిందే.ప్రస్తుతం రామ్ చరణ్ వరుసగా సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే ఇటీవల రెండు సినిమాలతో ప్రేక్షకులను పలకరించాడు రామ్ చరణ్.అందులో ఒకటి ఆర్ఆర్ఆర్ సినిమా కాగా మరొకటి ఆచార్య సినిమా.
ఈ రెండు సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి విడుదలైన విషయం తెలిసిందే.అయితే ఆర్ఆర్ఆర్ పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు రామ్ చరణ్.
అంతే కాకుండా ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల అయ్యి ప్రపంచవ్యాప్తంగా ఎంతటి విజయం సాధించిందో అందరికి తెలిసిందే.సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపుగా 1200 కోట్ల భారీ బడ్జెట్ ను అందుకోవడమే కాకుండా ఇటీవల ఓటీటీ లో కూడా 1000 మిలియన్ మినిట్ వ్యూస్ అందుకోవడం కూడా ఒక సంచలనమే అని చెప్పవచ్చు.
ఆ తర్వాత విడుదలైన ఆచార్య సినిమా డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ గా నిలిచింది.
విడుదలైన వారం రోజుల్లోనే ఈ సినిమా థియేటర్లలో కనిపించకుండా పోయింది.ఇక ఓటీటీ లో విడుదల అయినా కూడా అందులో కూడా డిజాస్టర్ అయినట్టు తెలుస్తోంది.

ఇకపోతే ఆర్ఆర్ఆర్ పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్ కు ఆచార్య సినిమా ప్రభావం ఎంతో కొంత చూపుతుంది అని అనిపిస్తుంది.ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ క్రేజ్ ఒక్కసారిగా పెరగగా ఆచార్య సినిమాతో ఒక్కసారిగా క్రేజ్ డౌన్ అయినట్లు తెలుస్తోంది.మరి తదుపరి సినిమాలతో రామ్ చరణ్ ఇంతవరకు సక్సెస్ ని అందుకుంటుందో చూడాలి మరి.ఇక పోతే రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.