టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో తొమ్మిది మంది నిందితులను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు.కింగ్ కోఠి ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు.
అనంతరం ప్రవీణ్, రాజశేఖర్ ను సిట్ అధికారులు టీఎస్పీఎస్సీకి తీసుకెళ్లారు.
మిగిలిన ఏడుగురు నిందితులను హిమాయత్ నగర్ లోని సిట్ కార్యాలయానికి నిందితులను తరలించారు.
ఈ క్రమంలో మొత్తం ఆరు రోజుల పాటు నిందితులను పోలీసులు ప్రశ్నించనున్నారు.ఎవరు పేపర్ లీక్ చేశారు.? ఎవరెవరికి ఇచ్చారనే కోణంలో ఆరా తీయనున్నారు.