నిజామాబాద్ జిల్లాలోని మక్లూర్ వరుస హత్య కేసుల్లో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ మేరకు ప్రధాన నిందితుడు సహా ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ క్రమంలోనే ప్రధాన నిందితుడు ప్రశాంత్ తో పాటు అతనికి సహకరించిన మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.వరుస హత్యల నేపథ్యంలో కేసు నమోదు చేసిన పోలీసులు సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితులను పట్టుకున్నారు.
ఇప్పటివరకు నాలుగు మృతదేహాలు లభ్యం కాగా మరో ఇద్దరి మృతదేహాల కోసం పోలీసులు గాలిస్తున్నారు.కాగా ఆస్తికోసమే స్నేహితుడితో పాటు ఆయన కుటుంబ సభ్యులను నిందితుడు ప్రశాంత్ హత్య చేశాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారని తెలుస్తోంది.
మరోవైపు ఇవాళ నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.ఈ క్రమంలోనే కేసుకు సంబంధించి వివరాలను పోలీసులు వెల్లడించనున్నారని సమాచారం.