కృష్ణా జిల్లా గుడివాడ రూరల్ పోలీస్‎స్టేషన్‎లో ఏసీబీ దాడులు

కృష్ణా జిల్లా ఏసీబీ వలకు అవినీతి తిమింగలం చిక్కింది.ఈ క్రమంలో గుడివాడ రూరల్ పోలీస్‎స్టేషన్‎లో ఏసీబీ అధికారులు దాడులు చేశారు.

రూ.75 వేలు లంచం తీసుకుంటూ సీఐ జయకుమార్ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు.కాగా సీఐ జయకుమార్ పై ఇమేజ్ డిజిటల్స్ మేనేజర్ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

ఇటీవల జగన్ గుడివాడ పర్యటనలో గో బ్యాక్ జగన్, దళిత ద్రోహి సీఎం స్టిక్కర్లు ఇమేజ్ డిజిటల్స్ ముద్రించిందని సమాచారం.అయితే ఈ కేసులో సీఐ తమను వేధిస్తున్నాడంటూ ఇమేజ్ డిజిటల్స్ వారు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు గుడివాడ రూరల్ పోలీస్ స్టేషన్ లో తనిఖీలు నిర్వహించారు.

ఈ హోమ్ మేడ్ నైట్ క్రీమ్ తో మీ స్కిన్ బ్రైట్ అవ్వడం ఖాయం!
Advertisement

తాజా వార్తలు