ప్రకాశం జిల్లా గిద్దలూరు నగర పంచాయతీ కార్యాలయంలో ఏసీబీ దాడులు జరిపారు.టౌన్ ప్లానింగ్ అధికారి సతీష్ కుమార్, అసిస్టెంట్ అజీజ్ లు లంచం తీసుకుంటూ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు.గిద్దలూరుకు చెందిన రాజశేఖర్ అనే వ్యక్తి బిల్డింగ్ నిర్మాణం అనుమతుల కోసం వెళ్లగా టౌన్ ప్లానింగ్ అధికారి, అసిస్టెంట్ రూ.50 వేలు లంచం డిమాండ్ చేశారు.దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు.ఈ క్రమంలో రూ.40 వేలు లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.అనంతరం కార్యాలయంలో సోదాలు నిర్వహించారు.







