ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజుకు మరోసారి మావోయిస్టులు హెచ్చరికలు చేసినట్లు తెలుస్తోంది.పద్ధతి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలుంటాయన్నారు.
పేదల భూములు కబ్జా చేసే అనుచరులను అదుపులో ఉంచుకోవాలని మావోయిస్టులు లేఖలో హెచ్చరించారు.మావోయిస్టు పార్టీపై మంత్రి చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండించాలని పేర్కొన్నారు.
అదేవిధంగా మావోయిస్టు ప్రజా సంఘాలుగా చెలామణి అవుతున్న దుష్ట చతుష్టయం మంత్రికి లోపాయికారంగా ఇస్తున్న సలహాలు, సూచనలు మానుకోవాలని సూచించారు.