హైదరాబాద్ లోని బంజారాహిల్స్ సీఐ నరేందర్ చుట్టూ అవినీతి ఉచ్చు బిగుస్తోంది.అక్రమ వసూళ్ల వ్యవహారంపై ఏసీబీ అధికారులు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు.
ఈ కేసుకు సంబంధించి బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ నరేందర్, ఎస్ఐ నవీన్ రెడ్డితో పాటు హోంగార్డ్ హరికి ఏసీబీ నోటీసులు ఇచ్చిందని తెలుస్తోంది.ఈ మేరకు సోమవారం ఏసీబీ కార్యాలయానికి రావాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారని సమాచారం.
అలాగే సీఐ నరేందర్, ఎస్ఐ నవీన్ రెడ్డిని వైద్య పరీక్షల నిమిత్తం ఏసీబీ ఆఫీస్ నుంచి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.నిన్న సీఐ నరేందర్ ను దాదాపు 20 గంటల పాటు ప్రశ్నించిన ఏసీబీ అధికారులు పబ్ ఓనర్స్ ను పిలిపించి వారి స్టేట్ మెంట్స్ ను రికార్డ్ చేశారు.ఈ క్రమంలోనే పబ్ ఓనర్స్ నుంచి నెలకు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు సీఐ డిమాండ్ చేసినట్లుగా గుర్తించారు.ఈ నేపథ్యంలోనే రూ.50 వేలను పబ్ ఓనర్ సీఐకు ఆన్ లైన్ పేమెంట్ చేశారు.ఈ వ్యవహారంలో ఇన్స్పెక్టర్ కు ఎస్ఐ నవీన్ రెడ్డి, హోంగార్డ్ హరి సహకరించారని అధికారులు గుర్తించారు.







