ఏపీలోని స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసుపై విజయవాడలోని ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది.ఇందులో భాగంగా ఏ13గా ఉన్న చంద్రకాంత్ ను అధికారులు కోర్టులో ప్రవేశపెట్టారు.
ఈ క్రమంలో చంద్రకాంత్ తాను అఫ్రూవర్ గా మారుతున్నట్లు న్యాయస్థానానికి తెలిపారు.ఈ క్రమంలోనే వాదనలు విన్న ఏసీబీ కోర్టు తదుపరి విచారణను జనవరి 5వ తేదీకి వాయిదా వేసింది.
ఈ నేపథ్యంలో జనవరి 5న చంద్రకాంత్ స్టేట్ మెంట్ ను న్యాయస్థానం రికార్డ్ చేయనుంది.కాగా ఇదే కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడంతో ఆయన బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.







