ఏబీవీపీ ఆధ్వర్యంలో బడుల బంద్ విజయవంతం

ఏబీవీపీ ఆధ్వర్యం( ABVP )లో రాష్ట్రవ్యాప్త బందుకు పిలుపునిచ్చిన నేపథ్యంలో సిరిసిల్ల జిల్లా( Rajanna Sircilla ) వ్యాప్తంగా పాఠశాల బందు విజయవంతం కావడం జరిగిందని ఏబీవీపీ నాయకులు తెలిపారు.ఈ సందర్బంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి దశాబ్ది కాలం గడిచిన కూడా ప్రాథమిక పాఠశాల నుంచి ఉన్నత పాఠశాల వరకు పూర్తిగా విద్యను రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని అన్నారు.

నిర్బంధ విద్య అంటూ ప్రకంపనలు పలికి వారి హామీలను అమలు చేయకుండా రెగ్యులరైజేషన్ పేరు మీద 8,624 ప్రభుత్వ పాఠశాలలు మూసివేసారని, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు లేవని అన్నారు.6800 ప్రాథమిక పాఠశాలలో ఒక్కొక్క టీచరు ఉన్నారని, 596 మండలాల్లో 578 మండలాలకు విద్యా అధికారులు లేరని కనీసం పాఠశాలలో స్విపర్స్ లేక ఉపాధ్యాయులు,విద్యార్థులు శుభ్రం చేసుకునే పరిస్థితి ఉందనీ అన్నారు.విద్యార్థులు దుర్భర పరిస్థితిలో విద్యను అభ్యసిస్తున్నారని,రాష్ట్రములో పాఠశాలలు శిదిలావస్థలో ఉన్నాయని,ఎప్పుడు కులుతాయో వర్షానికి నానుతు ఎండకు ఎండే దుస్థితి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

విద్యాహక్కు చట్టం అమలు చేయాలనీ, గతంలో మన ఊరు మన బడి కార్యక్రమానికి 7 కోట్ల నిధులు కేటాయించి మౌలిక వసతులు కల్పిస్తామని హామీలతో చేతులు దులుపుకొని మళ్లీ ఇప్పుడు మరొక నాటకంతో తెరపైకి వచ్చి మళ్లీ 3500 కోట్ల తో పాఠశాలల అభివృద్ధి అంటూ హడావుడి చేసింది అన్నారు.రాష్ట్రంలో 15 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్న వాటిని భర్తీ చేయకుండా మౌలిక వసతులు కల్పిస్తే ఉపాధ్యాయులు లేకుండా విద్యార్థికి ఏ విధంగా నాణ్యమైన విద్య అందుతుందని ప్రశ్నించారు.

ప్రభుత్వ పాఠశాలలు( Government Schools ) గాలికి వదిలేసి కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ లక్షలకు లక్షలు ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల రక్తాన్ని జలగల పిలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించు కోవడంలేదని, ఎలక్షన్ ఫండింగ్ లకు అమ్ముడుపోయి కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తుందని మండిపడ్డారు.ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న అక్రమంగా నడుస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థల పై( Corporate Schools )న చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేయాలని డిమాండ్ చేశారు.

లేనిపక్షంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో తీవ్ర ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో , నవీన్ రెడ్డి, వెంకటేష్, రాకేష్,శివ, సర్వేశ్వర్, మహేష్,శ్రీకాంత్ సాయికృష్ణ, ప్రశాంత్, వరుణ్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
రౌడీ షీటర్స్ సత్ప్రవర్తనతో మెలగాలి - కోనరావుపేట ఎస్ఐ శేఖర్ రెడ్డి

Latest Rajanna Sircilla News