Karthikamasam Bhagini Hastha Bhojanam: కార్తీక మాసంలోనీ రెండవ రోజు యమ ద్వితీయ ప్రత్యేకత గురించి మీకు తెలుసా

ప్రపంచవ్యాప్తంగా ఉన్నా మన దేశస్థులు అన్న చెల్లెలి పండుగ అంటే కచ్చితంగా రాఖీ పండగే అని చెబుతారు.

కానీ ఎన్నో పురాతన పురాణాల ప్రకారం అన్నా చెల్లెలి పండుగలలో ప్రత్యేకమైనది భగిణి హస్త భోజనం అని చాలామంది వేద పండితులు చెబుతున్నారు.

ఎందుకంటే బాగిని అంటే సోదరి అని అర్థం.ఆమె వడ్డించే భోజనం కానుకే బాగిని హస్తభోజనం అని అంటారు.

కార్తిక శుద్ధ విదియా అంటే కార్తీక మాసంలో రెండో రోజు ఇలా జరుపుకుంటారని అర్థం.దాదాపుగా ఈ విషయాన్ని అర్థమయ్యేలా చెప్పాలంటే రాఖీ పండుగతో ఈ కార్తీకమాసంలో వచ్చే రెండవ రోజు కూడా సమానమైనదే అని అప్పటి ప్రజలు నమ్మేవారు.

అయితే రక్షాబంధనం రోజు అన్నాతమ్ములు తమ సోదరీ రక్షా కట్టినందుకు ఆమె యోగక్షేమాలు చూస్తామని, ఎప్పుడూ ఆమెని రక్షిస్తామని చెబుతారు.ఆ తమ్ముడి ఆరోగ్యం ఆయుష్షు కోరుకుంటూ అక్కా చెల్లెలు ఈ వేడుకను చేస్తారు.

Advertisement

ఎన్నో పురాణ శాస్త్రాల ప్రకారం యమ ధర్మరాజు సోదరి యమునా.ఆమె వివాహమై వెళ్లాక తన సోదరుడిని ఇంటికి ఎన్నోసార్లు రమ్మని చెబుతుంది.

కానీ యమధర్మరాజు వెళ్లలేక పోతాడు.కానీ ఒకసారి కార్తీకమాసం రెండవ రోజున అనుకోకుండా చెల్లెలు యమునా ఇంటికి యమధర్మరాజు వెళ్తాడు.

సోదరుడు వచ్చాడని యమునా ఎంతో సంతోషించి పిండి వంటలతో వంటచేసి భోజనం వడ్డిస్తుంది.

చాలా రోజుల తర్వాత అన్నా చెల్లెలు కలుసుకోవడంతో ఇద్దరు ఎంతో సంతోషంగా మాట్లాడుకుంటారు.ఆనందంలో యమధర్మరాజు యమునని ఏదైనా వరం కోరుకోమని చెబుతాడు.అయితే తనకు అత్యంత ఆనందాన్ని ఇచ్చే ఈ రోజున ఎవరైతే అక్కాచెల్లెళ్ల ఇంట్లో భోజనం చేస్తారో వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించమని యమునా కోరుకుంటుంది.

కల్కి పై మోహన్ బాబు రివ్యూ...భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!
కలర్ ను పెంచే ఖర్జూరం.. వారానికి 2 సార్లు ఇలా వాడితే రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు!

ఆ వరానికి ఎంతో సంతోషపడిన యమధర్మరాజు తన సోదరి ఇంట్లో భోజనం చేసినా, కార్తిక మాసంలో రెండవ రోజు ఎవరైనా వారి అక్కాచెల్లెళ్ల చేతి భోజనం తింటారో వారికి అకాల మరణ దోషం లేకుండా ఉంటుందని వరం ప్రసాదిస్తాడు.అంతేకాకుండా ఆ అక్క, చెల్లెలు అందరూ సౌభాగ్యవతులుగా ఉంటారని వరమిస్తాడు.

Advertisement

తాజా వార్తలు